హర్షవర్థన్‌ జనరల్ మెడిసిన్‌లో వైద్య సేవలు అందిస్తున్నాడు.

ఖమ్మం జిల్లాకు చెందిన ఈయన వృత్తిరీత్యా ఆస్ట్రేలియాలో బ్రిస్బేన్‌లో ఉంటున్నాడు.

2020 ఫిబ్రవరి 12లో హర్షకు సింధు అనే యువతితో పెళ్లయింది.

పెళ్లి తర్వాత ఒక్కడే ఆస్ట్రేలియా వెళ్లాడు. ఆ తర్వాత భార్యను తీసుకెళ్లాలని భావించాడు.

అయితే, ఆస్ట్రేలియాలో ఉండగా అతడికి లంగ్‌ క్యాన్సర్‌ ఉన్నట్లు తేలింది.

మరి కొన్ని నెలల్లో చనిపోతాడని కూడా తెలిసింది.

క్యాన్సర్‌ సంగతి కుటుంబసభ్యులకు చెప్పాడు. భార్యతో విడాకులు తీసుకున్నాడు.

ఎంతో గుండె నిబ్బరంతో వ్యవహరించసాగాడు.

2022లో ఇండియాకు వచ్చి తల్లిదండ్రుల్ని అమెరికాలోని తమ్ముడి దగ్గరకు పంపాడు.

మళ్లీ ఆస్ట్రేలియాకు వచ్చాడు. అక్కడ అనాథలకు సేవలు చేయసాగాడు.

2023, మార్చి 27 లోపు చనిపోతాడని తెలిసి అంత్యక్రియలకు అన్ని ఏ‍ర్పాట్లు చేసుకున్నాడు.

మార్చి 24 ఉదయం వేళ నిద్రపోతూ తుది శ్వాస విడిచాడు.