ఉదయం లేవగానే ఎవరైనా సరే ఫుల్ ఎనర్జీతో ఉంటారు. ఎంత కష్టమైన పని అయినా సరే చాలా సింపుల్ గా చేసేస్తారు.
కానీ కొందరికి మాత్రం నిద్ర లేవగానే బాడీ అంతా నీరసంగా అనిపిస్తుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఎన్నో ఉంటాయి.
ఇక అలాంటి వాటిలో ఒకటి పాదాల్లో నొప్పిగా అనిపించడం. నేలపై పాదాలని పెట్టగానే విపరీతమైన పెయిన్ వస్తుంది.
ఈ నొప్పి వల్ల మన పనులు మనం సరిగా చేసుకోలేం. అయితే ఈ పెయిన్ కి చాలా కారణాలున్నాయని నిపుణులు అంటున్నారు.
మీ పాదాలకు సరిపోని షూస్ వేసుకోవడం, పడుకునే పొజిషన్ సరిగ్గా లేకున్నా పాదాల నొప్పి కలుగుతుంది. ఉదయం పూట పాదాల నొప్పి కొన్నిసార్లు డేంజర్ కూడా.
మీ పాదాల్లో విపరీతమైన నొప్పి కలిగితే కచ్చితంగా డాక్టర్ ని సంప్రదించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
నిద్రలేచి, మీ పాదాలని నేలపై పెట్టగానే విపరీతమైన పెయిన్ వస్తే దానిని ప్లాంటార్ ఫాసిటిస్ అని చాలామంది భావిస్తారు.
హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్ ప్రకారం.. దీర్ఘకాలిక మడమ నొప్పికి ఇది చాలా సాధారణ లక్షణం. అయితే పాదాల నొప్పికి మరిన్ని కారణాలు కూడా ఉండొచ్చు.
సాధారణంగా పాదాలు లేదా మడమలలో నొప్పి అందరికీ వచ్చినా.. మహిళల్లో మాత్రం సర్వ సాధారణమని నిపుణులు అంటున్నారు.
ఎందుకంటే మగవారితో పోల్చితే ఆడవారిలోనే విటమిన్ డి, కాల్షియం లోపం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పోషకాల లోపం వల్ల కూడా పాదాల్లో నొప్పి కలుగుతుంది.
రుతువిరతి వయస్సు వచ్చిన ఆడవారి శరీరంలో ఎన్నో రకాల మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి.
ఉదాహరణకు.. రుతువిరతికి చేరుకున్న మహిళల్లో అంటే 50 ఏళ్లు దాటిన వారిలో ఉదయం పాదాల్లో నొప్పి కలగడం సర్వ సాధారణం. వీళ్లు బోలు ఎముకల వ్యాధితో బాధపడే ఛాన్సెస్ ఉన్నాయి.
పాదాల్లో నొప్పికి వయస్సుతో సంబంధం అసలే లేదంటున్నారు నిపుణులు. షుగర్ ఉన్నవాళ్లు కూర్చున్నప్పుడు లేదా కదిలేటప్పుడు పాదాలు లేదా మడమలలో నొప్పి కలిగే ఛాన్స్ ఉంది.
ఆర్థరైటిస్ లేదా ఆస్టియో ఆర్థరైటిస్ తో బాధపడుతున్న వాళ్లు కూడా పాదాల్లో నొప్పితో బాధపడొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చాలా వారాలు లేదా నెలల నుంచి ఈ సమస్యతో బాధపడుతుంటే కచ్చితంగా హాస్పటల్ కు వెళ్లాలంటున్నారు. అసలు ఈ నొప్పి ఎందుకు వస్తుందో తెలుసుకుంటే మంచిది.
ఆర్థరైటిస్ లేదా ఆస్టియో ఆర్థరైటిస్ సమస్యలుంటే ఆరోగ్యకరమైన ఫుడ్ తో పాటు మెడిసిన్స్ కచ్చితంగా ఉపయోగించండి. ఫిజియోథెరపీ కూడా ఈ నొప్పులను తగ్గిస్తుంది.
మీ శరీరంలో విటమిన్ డి, కాల్షియం లోపం ఉంటే పాలు, పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోండి. కొన్ని రకాల ఆహారాల్లో సహజంగా విటమిన్ డి 3 లో సమృద్ధిగా ఉంటుంది.
ఫ్యాటీ చేపల మాంసం, చేపల కాలేయ నూనెలు విటమిన్ డీ3కి ఉత్తమ వనరులు, జున్ను, గుడ్డు సొన, గొడ్డు మాంసం కాలేయంలో కూడా ఈ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.
కొన్ని పుట్టగొడుగుల్లో విటమిన్ డి ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అందుకే సరైన ఆహార పదార్థాలను తినండి. దీంతో మీ ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉంటాయి.
నోట్: పైన టిప్స్ పాటించేముందు మీ దగ్గర్లోని డాక్టర్, నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.