మెరుగైన ఆరోగ్యం కోసం స్నానం చేయడం చాలా అవసరం. దీంతో మనిషి రోజంతా పరిశుభ్రంగా ఉండడంతో పాటు కాస్త యాక్టివ్ గా ఉంటారు.

అయితే కొందరు ఉదయం పూట తల స్నానం చేస్తే మరికొందరు సాయంత్రం వేళ తల స్నానం చేస్తుంటారు. 

మరో విషయం ఏంటంటే? తల స్నానం చేశాక చాలా మంది జుట్టు ఆరాడం కోసం తలకు టవల్ ను చుడుతుంటారు.

జుట్టుకు టవల్ చుట్టడం చాలా ప్రమాదమట. అసలు తడిగా ఉన్న జుట్టుకు టవల్ చుడితే ప్రమాదమేంటి? నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

చాలా మంది తల స్నానం చేశాక జుట్టు తడి ఆరడం కోసం తలకు టవల్ చుడుతుంటారు.

అలా తలకు టవల్ ను మెలిపెట్టి చుట్టడం వల్ల అనేక జుట్టు సమస్యలు వస్తాయని వైద్య నిపుణలు సూచిస్తున్నారు.

జుట్టు తడిగా ఉన్నప్పుడు  తలకు టవల్ చుడితే జుట్టు దారుణంగా ఊడిపోవడమే కాకుండా త్వరగా డ్రై కూడా అవతుందట.

తలకు చుట్టిన అదే టవల్ ను ముఖంపై తుడిస్తే ముఖంపై ఉన్న చర్యం దెబ్బతింటుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

అలా తడి జుట్టుకు చుట్టుకున్న అదే టవల్ ను మరొకరు వాడడం ద్వారా అనేక సమస్యలు కూడా రావచ్చని తెలుస్తోంది.

తడి జుట్టుకు టవల్ ను మెలిపెట్టి పదే పదే చుట్టడం ద్వారా జుట్టు మొదళ్ల నుంచి వదులుగా మారే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది.

తడి జుట్టుకు టవల్ ను చుట్టడం వలన జుట్టుకు ఉండే నేచురల్ ఆయిల్ ఉండకుండా పోయి జుట్టు దెబ్బతింటుందట.

ఇలా జుట్టు తడిగా ఉన్నప్పుడు తలకు టవల్ వాడడం ద్వారా జుట్టు పొడి బారడంతో పాటు జుట్టు దారుణంగా ఊడిపోయే ప్రమాదం కూడా పొంచి ఉందని నిపుణులు సూచిస్తున్నారు.