చికెన్.. ఈ మాంసాన్ని ఎంతో మంది చాలా ఇష్టంగా తింటుంటారు. 

అందుకోసం చికెన్ తో చాలా రకాలుగా వంటకాలు చేసుకుని తింటూ ఉంటున్నారు.

చికెన్ బిర్యానీలు, చికెన్ మంచురియా, చికెన్ పకోడి, చికెన్ చెట్నీ అంటూ ఇలా ఎన్నో రకాలుగా వండుకుని ఇష్టంగా తింటూ ఉంటారు.

ఇకపోతే చాలా మంది చికెన్ ను షాప్స్ నుంచి తెచ్చుకున్న వెంటనే నీటితో శుభ్రంగా కడిగి ఆ తర్వాత వండుకుంటారు.

అయితే చికెన్ అలా కడగడం మంచిది కాదని నిపుణులు తెలియజేస్తున్నారు. 

అసలు చికెన్ కడగడం ద్వారా వచ్చే సమస్యలు ఏంటి? నిపుణులు చెబుతున్నది ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు మీ కోసం.

మనం షాప్స్ నుంచి చికెన్ తెచ్చుకున్న వెంటనే నీళ్లతో శుభ్రంగా కడిగి ఆ తర్వాత వంట చేసుకుంటుంటాం.

కానీ అలా చికెన్ ను కడగడం అంత మంచిది కాదని నిపుణులు తెలియజేస్తున్నారు.

చికెన్ ను కడగడం ద్వారా బ్యాక్టిరియా స్ప్రెడ్ అవుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. 

త ద్వారా చికెన్ ద్వారా వచ్చే బాక్టిరియా అంతా వంటగదిలో చేరిపోతుంది.

దీంతో క్రాస్- కంటామినేషన్ ప్రమాదాన్ని పెంచుతుందని హెచ్చరిస్తున్నార

అంటే ఆహార సంబంధమైన అనారోగ్యాలకు కారకాలుగా మారతాయని సూచిస్తున్నారు.

అయితే చాలా మంది ప్రజలు మాత్రం.. చికెన్ ను ఖచ్చితంగా కడగాలనే నియమాన్ని పెట్టుకుంటున్నారు.

కడగకపోవడం వల్ల ఎలాంటి నష్టాలు రావని తెలియజేస్తున్నారు. 

అంతగా కడగాల్సి వస్తే.. ట్యాప్ కింద కాకుండా సింక్ లో కడగాలని నిపుణులు సూచిస్తున్నారు.

నోట్: పైన టిప్స్ పాటించేముందు మీ దగ్గర్లోని డాక్టర్, నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.