ప్రస్తుతం ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. పొద్దున 7 గంటలకు సూరీడు డ్యూటీ ఎక్కుతున్నాడు.
విపరీత ఎండ వేడిమికి తోడు వడగాలులతో శరీరానికి చెమటలు పట్టి, చిరాకు తెప్పిస్తుంటాయి.
హాయిగా ఇంటికి వెళ్లి ఏసీ ఆన్ చేసుకుని, నిద్రకు ఉపక్రమించాలని భావిస్తుంటాం.
ఇక హాయిగా నిద్రపోదామని, ఏసీ స్విచ్ ఆన్ చేసి.. గదిని చల్లగా ఉంచడం కోసం ఉష్ణోగ్రతలు తగ్గించేస్తుంటారు.
అయితే గాఢ నిద్ర కోసం ఏసీ ఉష్ణోగ్రతలు ఎలా ఉంచాలన్న విషయంపై వైద్యులు పలు సూచనలు చేస్తున్నారు.
ప్రశాంతమైన నిద్ర కోసం గది ఉష్ణోగ్రత 18.3 డిగ్రీల సెల్సియస్‌లో ఉంచాలి. కొంచెం తక్కువ లేదా కొంచెం ఎక్కువ ఉంచుకోవచ్చు.
చాలా మంది వైద్యులు గది ఉష్ణోగ్రతను 15.6 నుండి 19.4 డిగ్రీల సెల్సియస్ పరిధిలో ఉంచడం ఉత్తమమని చెబుతున్నారు.
ఫ్లిప్‌కార్ట్ , శామ్‌సంగ్ ఏసీ, ఎల్‌జీ ఏసీ కొత్తవైతే .. చిన్న పిల్లలకు చలి ఎక్కువగా అనిపిస్తుంది.
కాబట్టి, వేసవిలో వారి గదిలో ఉష్ణోగ్రత ఒకటి నుండి రెండు డిగ్రీల సెల్సియస్ ఎక్కువ ఉంచడం మంచిదని చెబుతున్నారు.
వారి గది ఉష్ణోగ్రత 20.5 డిగ్రీల సెల్సియస్‌లో ఉంచాలట, అప్పుడే వారు ప్రశాంతమైన నిద్రకు ఉపక్రమిస్తారట.
అలాగే వేడిగా కూడా ఉండనివ్వద్దు అని సూచిస్తున్నారు. ఏసీ వేసినప్పుడు చిన్నపిల్లలు బరువైన దుప్పట్లు లేదా మెత్తని బొంతలలో కప్పొద్దని సూచిస్తున్నారు.
పిల్లలు, పెద్దలు కంఫర్ట్‌గా ఉండే బట్టలు ధరించాలి, అప్పుడే మంచి నిద్ర వస్తుందని చెబుతున్నారు.
తల్లిదండ్రులు నిద్రించే సమయంలో పిల్లల పొత్తికడుపు మరియు మెడ వెనుక భాగాన్ని తాకి వారి శరీర ఉష్ణోగ్రత పెరగడం లేదా అని తనిఖీ చేయాలట.
వివిధ పరిశోధనల ప్రకారం, పిల్లలు 11 వారాల వయస్సులో ఉష్ణోగ్రత పరంగా పరిపక్వం చెందుతారు.
ఈ వయస్సులో, పెద్దవారిలాగే, వారి సాధారణ శరీర ఉష్ణోగ్రత 97.5°F అంటే నిద్రపోయిన 4 గంటలలోపు 36.4°Cకి చేరుకుంటుందట.