మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అనేక రోగాల బారిన పడుతున్నారు.

మరీ ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇది వంశపారపర్యంగా కూడా వస్తుండడం విశేషం.

మధుమేహం బారినపడిన వారు ఆహార నియమాలు పాటించకపోవడం ద్వారా ఆ వ్యాధి మరింత ముదురుతోంది.

షుగర్ వ్యాధితో బాధపడేవారు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి? మరీ ముఖ్యంగా ఖర్జూరాలు తినొచ్చా లేదా అనే సందేహంలో ఉంటుంటారు.

షుగర్ వ్యాధితో బాధపడేవారికి ఆరోగ్య నిపుణులు ఆహారం విషయంలో ఎలాంటి సలహాలు ఇస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

ముధుమేహంతో బాధపడేవారు ఏది పడితే అది తిని చెక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోకుండా ఆరోగ్యాన్ని చేజేతుల్లా దెబ్బతీసుకుంటున్నారు.

మురీ ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులు ఖర్జూరాను తినొచ్చా అంటే అవుననే సమాధానాలు చెబుతున్నారు. 

అయితే మరికొంత మంది మాత్రం షుగర్ పేషెంట్స్  అస్సలు ఈ ఖర్జూరాలు తినకూడదని చెబుతున్నారు. 

వాస్తవానికి షుగర్ వ్యాధి గ్రస్తులు ఖర్జూరాను తింటే షుగర్ లెవల్స్ అందుబాటులో ఉంటాయని నిపుణులు తెలియజేస్తున్నారు.  

ఖార్జూరాల్లో మెగ్నీషియం, ఐరన్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. దీంతో ఎముకలు బలంగా ఉండడానికి కూడా తోడ్పడతాయి.

షుగర్ వ్యాధి గ్రస్తులు  ఖర్జూరాను తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడంతో పాటు షుగర్ లెవల్స్ ను అందుబాటులో ఉంచుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. 

షుగర్ వ్యాధి గ్రస్తులు ఖర్జూరాను తినొచ్చు కదా అని ఎక్కువగా తీసుకోవడం కూడా ప్రమాదేమేనని నిపుణులు సూచిస్తున్నారు.