సాధారణంగా తీపి పదార్థాలు తింటే బరువు పెరుగుతారని వైద్య నిపుణులు హెచ్చరిస్తుంటారు. కానీ ఓ స్వీట్ తింటే మాత్రం వెయిట్ తగ్గుతారు.

నిజానికి చక్కెరతో చేసిన స్వీట్స్, కూల్ డ్రింక్స్, ఇతర తీపి పదార్థాలు బాడీ వెయిట్ ని పెంచుతాయి. ఎందుకంటే వీటిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి.

మన శరీరంలో కొవ్వు నిల్వలు ఎక్కువైతే అది కొవ్వుగా మారుతుంది. ఇది పొట్ట, నడుము చుట్టూ ఎక్కువగా పేరుకుపోతుంది.

నిజం చెప్పాలంటే.. మన శరీరానికి కొంతమొత్తంలో చక్కెర అవసరమవుతుంది. ఒకవేళ అది లేకపోతే.. మగతగా, నీరసంగా అనిపిస్తుంది.

చక్కెరతో మన శరీరం శక్తివంతంగా మారుతుంది. అయితే శుద్ధి చేసిన చక్కెర మన బాడీకి మంచి కంటే హాని ఎక్కువ చేస్తుంది.

అందుకే తెల్ల చక్కెరకు బదులు నేచురల్ గా దొరికే చక్కెరని తీసుకోవాలి. అప్పుడే మనం బరువు తగ్గుతాం, ఆరోగ్యంగా ఉంటాం.

శుద్ధి చేసిన చక్కెర కంటే తేనే మన ఆరోగ్యానికి చాలా మంచిది. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

తేనె తీసుకోవడం వల్ల ఊబకాయాన్ని తగ్గించడమే కాదు.. చర్మాన్ని అందంగా మార్చుకోవచ్చని నిపుణులు అంటున్నారు.

తేనెలో విటమిన్ సీ, విటమిన్ బీ6, అమైనో ఆమ్లాలు, రిబో ఫ్లేవిన్, కార్భోహైడ్రోట్లు, నియాసిన్ పుష్కలంగా ఉంటాయి.

తేనెలో కేలరీలు, షుగర్ చాలా తక్కువగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల బరువు పెరుగుతామనే భయం ఉండదు. ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది.

నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ప్రకారం.. తేనెని క్రమం తప్పకుండా తీసుకుంటే కావాల్సినంత శక్తి లభిస్తుంది.

తేనె వల్ల శరీరంలోని కేలరీలు కూడా కరుగుతాయి. త్వరగా బరువు తగ్గుతారు. జీవక్రియని కూడా ఇది పెంచుతుంది.

వేగంగా బరువు తగ్గాలనుకునేవారు.. ఉదయం నిద్రలేవగానే గ్లాసు గోరు వెచ్చని నీటిలో టీ స్పూన్ తేనెని బాగా కలిపి తాగండి.

ఇంకా బెటర్ రిజల్ట్స్ కోసం.. దీనిలోనే నిమ్మరసం కలిపి తాగండి. కొంతమంది. గ్రీన్ టీలో తేనెని కలిపి తాగడానికి ఇష్టపడతారు.

నోట్:  పై చిట్కాలు పాటించేముందు మీ దగ్గర్లోని డాక్టర్ సలహా కూడా తీసుకోండి!