నేటి ఆధునిక కాలంలో మనిషి ఆరోగ్యాన్ని పూర్తిగా గాలికొదిలేస్తున్నాడు.
ఉరుకుల పరుగుల జీవితంలో సరిగ్గా తిండి కూడా తినట్లేదు.
దాంతో అనేక అనారోగ్య సమస్యలను తనంతట తానే కొని తెచ్చుకుంటున్నాడు.
ఇక కొందరు తాము రోజూ పండ్లు తింటున్నాం అని గొప్పలు చెప్పుకునే వారు లేకపోలేదు.
సాధారణంగా మనం పండ్ల మార్కెట్ కు వెళ్లినప్పుడు.. పండ్లపై రకరకాల నెంబర్ల స్టిక్కర్లు అతికించి ఉంటాయి.
అవి అలా ఎందుకు అతికించి ఉన్నాయో, ఆ నంబర్ల వెనుక అర్దం ఏమిటో చాలా మందికి తెలిదు.
ఆ నంబర్ల వెనుకు అర్దాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఏదైనా పండుపై నాలుగు అంకెల నంబర్లు ఉంటే.. లేదా నాలుగు అనే సంఖ్యతో ఆ నంబర్ ప్రారంభం అయితే..
ఆ పండ్లను కృత్రిమ రసాయనాలు, సహజసిద్ద ఎరువులతో పండించారని అర్దం.
ఇక మరికొన్ని పండ్లపై ఐదు అంకెల గల నంబర్లు ఉండి, 9 అనే సిరీస్ తో ఆ నంబర్లు ప్రారంభం అయితే ఆ పండ్లను పూర్తిగా సేంద్రియ ఎరువులు అంటే రసాయనాలు లేకుండా పండించారని అర్ధం.
మరికొన్ని పండ్ల మీద ఐదంకెల సిరీస్ ఉండి 8 అనే అంకెతో ఆ సిరీస్ మెుదలైతే జన్యూమార్పిడితో వాటిని పండించినట్లు లెక్క.
ఇలాంటి పండ్లు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇక నుంచి పండ్లు కొనేముందు ఓ సారి ఈ అంశాలను దృష్టిలో ఉంచుకోండి మరి.