మరీ ముఖ్యంగా జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, చక్కెర, కొవ్వులు కలిగిన పదార్థాలను ఎక్కువగా తినడం వల్ల షుగర్ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు నిపుణులు.
ఇక చిన్న వయసులోనే మధుమేహం బారిన పడటానికి ప్రధాన కారణం ఒత్తిడి అని అధ్యాయనాలు చెబుతున్నాయి.
టైప్ 2 డయాబెటీస్ రావడానికి ఇదీ ఓ కారణం.
స్మోకింగ్ చేసే పిల్లల్లో టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నయంటున్నారు వైద్యులు. పొగాకులో ఉండే నికోటిన్ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచడమే దీనికి కారణం.
ఇక పిల్లల్లో షుగర్ వ్యాధికి రావడానికి మరో రీజన్.. నిద్రలేమి. తక్కువగా నిద్రపోయే లేదా నిద్రలేమి సమస్య ఉన్న పిల్లలకు డయబెటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువున్నాయని వైద్యులు చెబుతున్నారు.
ఆహారపు అలవాట్లను మార్చుకుని.. ఒత్తిడి, స్మోకింగ్, నిద్రలేమి సమస్యలను అధిగమిస్తే డయాబెటీస్ వ్యాధి నుంచి బయటపడొచ్చని వైద్యులు సూచిస్తున్నారు.