సాధారణంగ మనకు రోడ్డు ఎక్కగానే ఎక్కువగా కనిపించేవి ఆటోలు.

చిన్నగా కనిపించినా గానీ అందులో జనాల్ని మాత్రం ఎక్కువగానే ఎక్కిస్తారు.

ఇక ఆటోలను చూడగానే ముందుగా మన కళ్ళు డ్రైవర్ కూర్చున్న స్టైల్ వైపే వెళ్తాయి.

చాలా మంది ఆటో డ్రైవర్లు రకరకాల స్టైల్లో కూర్చుని డ్రైవ్ చేస్తుంటారు.

అయితే వారు ఎందుకు అలా నడుపుతారు అన్న డౌట్ చాలా మందికి వస్తుంది.

చాలా మంది అది ఆటో డ్రైవర్ల స్టైల్ అని అనుకుంటారు. కానీ కాదు.

దానికి కొన్ని కారణాలు ఉన్నాయంటున్నారు కొందరు డ్రైవర్లు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఇలా ఒక సైడ్ కు కూర్చుని ఆటోను నడపం ద్వారా వారికి ఎక్కువగా పట్టు దొరుకుతుందట. 

ఆటోను బ్యాలెన్స్ చేయడానికి వీలవుతుందట.

మరో విషయం ఏంటంటే? ఆటో నేర్చుకునేటప్పుడు సైడ్ కూర్చునే నేర్చుకోవాలి.

అప్పటి నుంచే వారికి ఇలా అలవాటు అవుతుందంటున్నారు కొందరు డ్రైవర్స్.

అదీకాక డ్రైవర్ ఇలా పక్కకు కూర్చుని ఉంటే.. మరో ప్రయాణికుడిని ఆటోలో ఎక్కించుకునేందుకు వీలుంటుంది.

దాంతో వారికి అదనంగా డబ్బులు వస్తాయి. ఇదీ ఓ కారణంగానే వారు చెబుతున్నారు.