ఏటీఎం పిన్ 4 డిజిట్స్ తో ఉంటుంది. ఇలా 4 అంకెలు మాత్రమే ఉండడానికి గల కారణం ఏంటి?
అసలు ఏటీఎం కార్డుకి పిన్ పెట్టాలన్న ఆలోచన ఎవరిది? ఎప్పుడైనా ఆలోచించారా?
ఏటీఎం అంటే ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్.
ఇండియాలో పుట్టిన బ్రిటిష్ దేశస్తుడు జాన్ అడ్రియన్ షెపర్డ్ బారన్ అనే వ్యక్తి ఈ ఏటీఎం మెషిన్ ను కనుగొన్నాడు.
ఆ తర్వాత ఏటీఎం కార్డుని కూడా కనుగొన్నాడు. అయితే కార్డుకి పిన్ ఉంటే భద్రత ఉంటుందని ఆలోచించాడు.
అలా ఆలోచించిన ఆయన మొదట 6 అంకెల సీక్రెట్ పిన్ ని సెట్ చేసుకున్నాడు.
అయితే జాన్ భార్య కారోలిన్.. 6 అంకెల పిన్ ను తిరస్కరించింది.
ఒకసారి ఏటీఎంను ఉపయోగించే సమయంలో సీక్రెట్ పిన్ మర్చిపోయింది.
పిన్ పెద్దగా ఉండడంతో గుర్తుపెట్టుకోవడం కష్టమని, 4 అంకెల పిన్ అయితే బాగుంటుందని ఆమె సూచించింది.
6 అంకెల పిన్ కంటే 4 అంకెల పిన్ అయితే సులువుగా గుర్తుంటుందని ఆమె సూచించడంతో జాన్ అడ్రియన్ 4 అంకెల పిన్ ను సెట్ చేశాడు.
ఇక అప్పటి నుంచి 4 అంకెల సీక్రెట్ పిన్ అందుబాటులో ఉంది.