కళ్ల ముందు ఏవైనా ప్రమాదాలు చోటు చేసుకుంటే వెంటనే 108 నంబర్‌కి కాల్‌ చేస్తాం.

108 అనగానే అంబులెన్స్‌ గుర్తుకు వస్తుంది. మరి అంబులెన్స్‌కి ఈ నంబర్‌ ఎందుకు పెట్టారో తెలుసా.

దీనికి ఆధ్యాత్మికంగా, శాస్త్రపరంగా అనేక కారణాలున్నాయి.

హిందూ సంప్రదాయంలో 108కి ఎంతో ప్రాముఖ్యత ఉంది.

ఉపనిషత్తులు, అష్టోత్తర నామావళిలో 108 నామాలు ఉంటాయి. పూజలు, యాగాలు వంటి సమయాల్లో 108 సార్లు పూలు వంటివి అర్పిస్తాం.

అలానే జపమాలలో 108 పూసలు ఉంటాయి. 108 సార్లు జపం చేస్తే మంచిది అంటారు.

ఖగోళ శాస్త్ర ప్రకారం చూసుకున్నా.. సూర్యుడు-భూమికి, భూమికి-చంద్రుడికి భూమికి మధ్య దూరం వాటి వ్యాసానికి సుమారుగా 108 రెట్లు ఉటుంది.

అలానే ఆయుర్వేదం ప్రకారం మనిషి శరీరంలో 108 మర్మ స్థానాలున్నాయి అంటారు.

27 న‌క్ష‌త్రాలు, ప్ర‌తి న‌క్ష‌త్రానికి 4 పాదాలు = 27x 4 = 108.. అలానే 12 రాశులు, 9 న‌క్ష‌త్ర పాదాలు = 12x9=108 వస్తుంది.

సైకాలజి పరంగా కూడా 108 నంబర్‌కు ఎంతో ప్రత్యేకమైంది అంటున్నారు నిపుణులు.

మనిషి డిప్రెషన్‌లో ఉన్నప్పుడు వారి చూపు సెల్‌ఫోన్‌ ఎడమ భాగం చివరి వైపుకు వెళ్తుంది అని తెలిపారు.

అయితే అక్కడ 0,8 నంబర్లు దగ్గరగా ఉండటం వల్ల.. 108 నంబర్‌ని అంబులెన్స్‌ సర్వీస్‌కు కేటాయించారని తెలుపుతారు.

అలానే 108 నంబర్‌లో తొలి సంఖ్య అయిన 1 మగవారిని, 0 ఆడవారిని సూచిస్తాయని.. ఇక 8వ నంబర్ ఇన్ఫినిటీ సూచిస్తుందని..

అందువల్లే అంబులెన్స్ కు 108 సంఖ్యని ఉపయోగిస్తున్నారని కొందరు చెబుతారు.