కార్తీకమాసంలో తులసి కళ్యాణం పూర్తి కావడంతో కళ్యాణ కాలం ప్రారంభమవుతుంది. పెళ్లిళ్లు కూడా స్టార్ట్ అవుతాయి.
ఇప్పటికే చాలావరకు పెళ్లిళ్లు ఫిక్స్ అయి ఉంటాయి. ఇప్పుడు కార్డులు పంచడం మొదలుపెడతారు.
పెళ్లిళ్ల సీజన్ కాబట్టి ఒకే రోజు మూడు నాలుగు కూడా జరుగుతుంటాయి. అయితే పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత మొదటి పెళ్లి కార్డ్ ఎవరికి ఇస్తారో తెలుసా?
సాధారణంగా వివాహ జాతకాన్ని హిందు సంప్రదాయం ప్రకారం ముద్రిస్తారు. మంగళ ప్రతాన్ని వ్రాయడంతో ముహుర్తాన్ని నిర్ణయిస్తారు.
ఈ పద్ధతులు తెలియని వారికి మొదటి పెళ్లికార్డు ఎవరికివ్వాలో తెలియదు. ఆ విషయంలో గందరగోళం అనిపించొచ్చు.
అయితే దీని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ముందుగా పెళ్లి కార్డు ఎవరికి ఇవ్వాలో మేం చెబుతాం.
ఏదైనా శుభకార్యం, పనులు స్టార్ట్ చేసేముందు భగవంతుడిని తలుచుకుంటాం.
ఇంట్లో పెళ్లి ఫిక్స్ అయినా సరే భగవంతుడికే తొలి కార్డు ఇస్తాం.
తొలి కార్డ్ దేవుడికి ఇవ్వాలి వరకు ఓకే.. కానీ ఏ దేవుడికి ఇవ్వాలా అని మళ్లీ కన్ఫ్యూజ్ అవుతున్నారా.. జస్ట్ రిలాక్స్.
విఘ్ననాశకుడిగా పేరు గాంచిన, ఆది దేవుడిగా పూజింపబడే గణేశుడికి మొదటి పెళ్లి కార్డు ఇస్తారు.
పెళ్లి ఎలాంటి ఆటంకం లేకుండా జరగాలని వినాయకుడిని ప్రార్థిస్తూ గణపతి పూజతో కార్డులు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు.
ఇక రెండో కార్డును వధూవరుల తాతయ్యలకు ఇచ్చి వారి ఆశీర్వాదం స్వీకరిస్తారు. దీని తర్వాత బంధువులు, మిగిలిన వారికి కార్డులు అందజేస్తారు.
వినాయకుడికి మొదటి మంగళపాత్ర ఇచ్చే ఆచారం.. చాలా ఏళ్లుగా ఉంది. వెడ్డింగ్ కార్డ్ లోనూ వినాయకుడి చిత్రం కూడా ఉంటుంది.
కార్డ్ ఎంత గ్రాండ్ గా ఉన్నా, ఎంత ఖరీదైన, డిజైన డిఫరెంట్ గా ఉన్నాసరే.. వినాయకుడి ఫొటో ఎప్పుడూ ఉంటుంది.
ఆది దేవుడికి గణపతికి వరం లభించింది. అందుకే భక్తులు గణపతిని పూజించకుండా ఏ పని ప్రారంభించరు.
నోట్: పై విషయాలు అందుబాటులోని సమాచారం ఆధారంగా రాశాం. పాటించేవారు గమనించగలరు.