వేసవి కాలంలో మేలు చేసే పండ్లలో పుచ్చకాయలు ప్రధానమైనవి. ఈ పండు డీ హైడ్రేషన్ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
పుచ్చకాయలో 90 శాతం వరకు నీరే ఉంటుంది. అందుకే వేసవి తాపం నుంచి ఇది శరీరాన్ని రక్షిస్తుంది.
వేసవి కాలంలో పుచ్చయాలు (వాటర్ మిలన్) కి మంచి గిరాకీ ఉంటుంది.. అయితే మంచి పుచ్చకాయలని కనుక్కోడానికి కొన్నిరకాల గుర్తులున్నాయి.
పుచ్చకాయలో ఆడ, మగ జాతులు అనే జాతులు ఉంటాయి.. ఆడ పుచ్చకాయ చిన్నగా గుండ్రంగా ఉంటుంది.
మగ పుచ్చకాయ పొడుగ్గా ఉండి కొడి గుడ్డు ఆకారంలో ఉంటుంది. తీపి కాయలు కావాంటే గుండ్రంగా ఉన్న కాయలను ఎంచుకుంటే మంచిది
పుచ్చకాయ అడుగు భాగంలో పసుపు రంగులో ఉంటే అది తీయగా.. రుచికరంగా ఉంటుంది. తెల్లగా ఉంటే.. కాస్త చప్పగా ఉంటుంది.
పుచ్చకాయ తొడిమ బాగా ఎండిపోయి ఉంటే ఆ పండు మంచి పక్వానికి వచ్చిందని అర్ధం. తొడిమ పచ్చగా ఉంటే ఇంకా పక్వానికి రాలేదని అర్థం
పుచ్చకాయ పూర్తిగా పండిందీ లేదు అని తెలుసుకోవడానికి దానిపై వేళ్లతో కొడితే టక్ టక్ అని శబ్ధం వస్తే బాగా పండినట్లు.. శబ్ధం రాకుంటే ఇంకా పండవలసి ఉందని లెక్క
తొడిమకు చివరలో అంటే పువ్వు వచ్చే వద్ద మచ్చలు ఉంటే దానిపై ఎక్కువ తేనెతీగలు వాలినట్లు లెక్క.. ఆ పంటు ఎంతో మధురంగా ఉంటుంది.
బాగా పండిన ముదురు కాయ ముక్కువద్ద పెట్టుకొని పీలిస్తే కమ్మని వాసన వచ్చిందంటే తీయగా ఉంటుంది.
మరీ వాసన తియ్యగా వస్తే మాత్రం ఆ కాయ మురిగిపోయేందుకు సిద్దంగా ఉన్నట్లు లెక్క.
పుచ్చకాయను ప్రెస్ చేస్తూ తడిమి చూడండి.. ఎక్కడైనొ మెత్తగా అనిపిస్తే ఆ కాయ దెబ్బతిన్నట్టు లెక్క.. అలాంటి కాయలు తీసుకోకపోవడం మంచింది
వేసవి కాలంలో పుచ్చకాయలు తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి.. ఇందులో రకాల విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి.
పుచ్చకాయలో విటమిన్ A, C, E పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు తక్కువ పరిమాణంలో ఫైబర్ ఉంటుంది.