విటమిన్ బి12 శరీరానికి చాలా అవసరమైన విటమిన్.

ఇది శారీరక శక్తిని పెంచుతుంది. నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. 

విటమిన్ బి12 లోపం వల్ల రక్తహీనత, అలసట, వికారం లాంటి సమస్యలు వస్తాయి. 

పాదాలు, చేతుల్లో జలదరింపు, తిమ్మిరి ఏర్పడతాయి. 

విటమిన్ బి12 లోపిస్తే కండరాలు బలహీనంగా తయారవుతాయి.

ఒంట్లో శక్తి క్షీణిస్తుంది. ఈ కారణంగా నడవడానికి కూడా ఇబ్బంది కలుగుతుంది.

ఆకలి లేకపోవడం, చిరాకు, వికారం, విరోచనాలు, బరువు తగ్గడం లాంటి సమస్యలు వస్తాయి.

విటమిన్ బి12 ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. 

శరీర భాగాలన్నిటికీ ఆక్సిజన్ ను సరఫరా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

విటమిన్ బి12 లోపిస్తే ఎర్ర రక్తకణాల ఉత్పత్తి ఆగిపోతుంది. దీని వల్ల శరీర భాగాలకు ఆక్సిజన్ అందదు. 

దీంతో ఎర్ర రక్తకణాల సంఖ్యను భర్తీ చేయడానికి గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభిస్తుంది.

ఇది శరీరంలో అధిక పరిమాణంలో రక్తాన్ని సరఫరా చేసేందుకు గుండెపై ఒత్తిడిని కలిగిస్తుంది. 

ఈ సమస్యల నుంచి బయట పడాలంటే విటమిన్ బి12 కలిగిన చేపలు, మాంసం, పాలు, గుడ్లు, జున్ను, తృణ ధాన్యాలు తినాలి. 

కొంతమంది ఈ ఆహారాలను తీసుకున్నప్పటికీ.. విటమిన్ బి12 లోపం మరీ తీవ్రంగా ఉంటుంది.

అలాంటి వాళ్ళు డాక్టర్ ను సంప్రదించి ఫుడ్ సప్లిమెంట్ లేదా ఇంజక్షన్లు చేయించుకోవాలి.