ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా అలవాటున్నోళ్లు మానలేరు. 

పైగా ఒకప్పుడు పెట్టె కాల్చేవాడ్ని, ఇప్పుడు బాగా తగ్గించేసా అని సమర్థించుకుంటారు.

ఇలా సమర్థించుకునే వాళ్ళలో షుగర్ పేషెంట్లు ఉంటే గనుక పెద్ద ప్రమాదంలో పడ్డట్టే.

ఎందుకంటే సిగరెట్ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడంతో పాటు అనేక ఇతర ప్రమాదకరమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

సిగరెట్ తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. 

సిగరెట్ తాగని వారితో పోలిస్తే సిగరెట్ తాగే వారిలో ఈ ప్రమాదం 30 నుంచి 40 శాతం వరకూ పెరిగే అవకాశం ఉంది.

సిగరెట్ లో ఉండే రసాయనాలు శరీర కణాలకు హాని చేస్తాయి. అలాగే వాటి సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. శరీరంలో మంటను కలిగిస్తాయి.

సిగరెట్ తాగడం వల్ల గుండె జబ్బులు వస్తాయి. మూత్రపిండాలు దెబ్బ తింటాయి.

సిగరెట్ తాగడం వల్ల డయాబెటిస్ క్రానిక్ అబ్స్ట్రక్తివ్ పల్మనరీ డిసీజ్, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తాయి.

సిగరెట్ వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఈ కారణంగా కిడ్నీలు, గుండె, రక్తనాళాల సమస్యలు, డయాబెటిస్ సమస్యలు అధికంగా ఉంటాయి.

సిగరెట్ తాగడం వల్ల ఊపిరితిత్తులు చెడిపోతాయి. దీర్ఘకాలిక బ్రోన్కైటిస్, ఎంఫిసెమా సహా పలు శ్వాస కోశ సమస్యలకి దారి తీస్తుంది.

ఈ వ్యాధులతో బాధపడుతున్న వారికి న్యుమోనియా వంటి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువ. డయాబెటిస్ ఉంటే ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది.

డయాబెటిస్ లేనివారితో పోలిస్తే.. డయాబెటిస్ ఉన్నవారు సిగరెట్ తాగడం వల్ల న్యుమోనియాతో చనిపోయే అవకాశం 3 రెట్లు అధికంగా ఉంటుంది.

షుగర్ పేషెంట్లు సిగరెట్ తాగడం వల్ల కంటి సమస్యలు వస్తాయి. కంటి శుక్లాలు, గ్లాకోమాతో సహా ఇతర కంటి సమస్యలు తలెత్తుతాయి.

మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోకపోతే డయాబెటిక్ రెటినోపతి సమస్య వస్తుంది. ఇది ముదిరితే అంధత్వం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

కాబట్టి డయాబెటిస్ ఉన్న వాళ్ళు సిగరెట్ కి దూరంగా ఉండండి. డయాబెటిస్ లేనివాళ్ళు, ఉందో లేదో తెలియని వాళ్ళు కూడా సిగరెట్ మానేస్తే బెటర్.

ఎందుకంటే సిగరెట్ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చినా మీకే రిస్కు, దాన్ని వెతుక్కుంటూ మీరు వెళ్లినా మీకే రిస్కు. నలిపి పడేస్తుంది జీవితాన్ని.