మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నిద్ర ఉండాలి.
అయితే అలా నిద్రలోకి వెళ్లిన సమయంలో కలలు రావడం అనేది సహజం.
కొందరు పగటికలలు కంటే మరికొందరు రాత్రివేళల్లో కలలు కంటారు.
వివిధ రకాల కలలు వచ్చినప్పుడు చాలా మంది అనేక సందేహాలు వ్యక్తం చేస్తుంటారు.
అయితే చనిపోయిన వారు కలలో కనిపిస్తే ఎవరికైనా భయమే.
ఏం జరుగుతుందో? ఇలాంటి కల ఎందుకు వచ్చిందో అని ఆలోచిస్తుంటారు.
మరి చనిపోయిన వ్యక్తి కలలోకి వస్తే ఏం జరుగుతుందో చూద్దాం..
చనిపోయిన వ్యక్తి కలలో వస్తే మంచిదేనని పురాణాల్లో చెప్పినట్లు తెలుస్తుంది.
చనిపోయిన వారు కలలో కనిపిస్తే ఆశీస్సులు ఉన్నట్టు భావించాలంట.
అలా కనిపిస్తే మంచి జరుగుతుందని అగ్నిపురాణం, గరుడపురాణం, వాయు పురాణంలో తెలుస్తుంది
ఇక చనిపోయిన వారి పేరు మీద కార్యక్రమాలు చేయడం కూడా మంచిదంట.
అంతేకాదు కలలో పాములు కనిపించినా కూడా పూర్వీకుల ఆశీర్వదించినట్లంట.
అనుకోకుండా ధన లాభం జరిగినా అది చనిపోయిన వారి ఆశీస్సుల వల్లేనని నమ్మకం.
అలానే అనుకున్న పనులు నెరవేరినా కూడా చనిపోయిన వారి ఆశీస్సులు ఉన్నాయని నమ్మకం.
మొత్తానికి చనిపోయిన వారు కలలో కనిపిస్తే మంచిదేనని పురాణాలు, కొందరు పండితులు అంటున్నారు.