నేటికాలంలో ప్రతి ఒక్కరు తినే ఆహారం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటున్నారు.
ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగపడే పదార్ధాలనే ఆహారంగా తీసుకుంటున్నారు.
అలానే పండ్లు, కూరగాయలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయనే విషయం తెలిసిందే.
అయితే కొన్ని మసాలాలు కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని తెలుసా?
మనకు ఆరోగ్యాన్ని అందించే మసాలా పదార్ధాల్లో అల్లం ఒకటి.
అల్లాన్ని నిత్యం ఆహారంలో తీసుకోవడం వలన శరీరంపై అనేక సానుకూల ప్రభావాలను కలిగి ఉంటుంది.
మసాలా వర్గానికి చెందిన అల్లంలో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నాయి.
అల్లంలో జింజెరోల్, షోగోల్, జింజిబెరెన్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.
మన ఆరోగ్యాన్ని కాపాడే ఔషధంగా సుదీర్ఘ చరిత్రను కలిగి ఉంది.
అల్లం వివిధ వ్యాధుల చికిత్సకు ఉపయోగించబడింది.
ప్రతి రోజూ ఆహారంలో అల్లం తీసుకోవడంతో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
అల్లం ఉండే జింజెరాల్ అనే బయోయాక్టివ్ వికారం, వాంతులు సమస్యలును తగ్గిస్తుంది.
అలానే అల్లం తీసుకోవడం వలన వాపు కీళ్ల సమస్యను తగ్గిస్తుంది.
అల్లం క్యాన్సర్, గుండె జబ్బుల నుండి రక్షణను కల్పిస్తుంది.
అల్లం వలన మెదడు పనితీరు, రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది.