ఔషద గుణాలు మెండుగా ఉండే ఆకుల్లో తమలపాకులు ప్రధానమైనవి.

తమలపాకుల్లో కాల్షియం, ఇనుము, విటమిన్ సి, పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి.

ఆకలి కలుగ జేయటంలో తమలపాకులు ఎంతో తోడ్పడతాయి.

కడుపు ఉబ్బరంగా ఉన్నవారు రెండు తమలపాకులు తీసుకుని చేతితో నలిపి వాటిని పాలలో కలుపుకొని తాగితే కడుపు ఉబ్బరం తగ్గుతుంది.

తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలకు తమలపాకులు అద్భుతంగా పనిచేస్తాయి.

తమలపాకుల రసంతో మసాజ్ చేయటం ద్వారా తలనొప్పి ఇట్టే తగ్గుతుంది.

జీర్ణ ప్రక్రియకు తోడ్పడి అరుగుదలను పెంచటంలో తమలపాకులు ఉపయోగపడతాయి.

తమలపాకు రసంతో మర్థనా చేస్తే నొప్పులు తగ్గుతాయి.

దగ్గు,జలుబు వంటివి వచ్చినపుడు తమలపాకులు తినడం వలన కఫం ఏర్పడదు.

రోజు తమలపాకులను తినడం ద్వారా దగ్గు, జలుబుల నుంచి తొందరగా బయటపడొచ్చు.

గమనిక: ఇది అంతర్జాలంలో సేకరించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. అవగాహన కోసం నిపుణులను, వైద్యులను సంప్రదించవలసినదిగా మనవి.