క్రైస్తవులు జరుపుకునే అతిముఖ్యమైన పండుగల్లో క్రిస్మస్ ప్రధానమైనది.
ఏటా డిసెంబర్ 25 న ఘనంగా క్రిస్మస్ వేడుకలను ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు.
ఈ పవిత్రమైన రోజున క్రైస్తవులు చర్చీలకు వెళ్లి యేసు ప్రభువును ఆరాధిస్తారు.
ఈ రోజున కొవ్వుత్తులను వెలిగించడం, సామూహిక ప్రార్థనలు, ప్రత్యేక విందు, క్రిస్మస్ చెట్టు వంటివి ప్రత్యేకంగా నిలుస్తాయి.
ఇక ఈ పండుగ రోజున క్రిస్మస్ కేక్ ప్రత్యేకంగా నిలుస్తుంది.
ఈ కేక్ ను పూర్వం తేమగా ఉండే జాంటే ఎండుద్రాక్ష, బంగారు ఎండుద్రాక్ష వంటి వాటితో తయారుచేసేవారు.
రానురాను క్రిస్మస్ కేక్ తయారీ విధానం పూర్తిగా మారిపోయింది.
నిజానికి 16 వ శతాబ్దంలోనే కిస్మస్ కు కేక్ ను కట్ చేసే ఆచారం వచ్చింది.
అయితే అప్పట్లో క్రిస్మస్ కు కూరగాయలు, రొట్టెలతో తయారుచేసిన వంటకాన్నే ఉపయోగించేవాళ్లు.
అయితే 16 వ శతాబద్దంలో గోధుమ పిండి, గుడ్లు, వెన్నతో కేక్ ను తయారుచేస్తారు.
ఈస్టర్ కేక్ కోసం కొందరు మార్జిపాన్ అనే బాదం చక్కెర పేస్ట్ ను ఉపయోగించేవారు.
చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. క్రిస్మస్ ఇకా నెల ఉందనగానే కేక్ లను రెడీ చేస్తారు.
అందులోనూ క్రిస్మస్ కేకులకు మార్కెట్ లో బలే డిమాండ్ ఉంటుంది.
ఇతర కేకుల్లా కాకుండా ఈ కేక్ చాలా చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది.
ఈ కేకులను ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ తోనే తయారుచేస్తారు.
ఎందుకంటే డ్రైఫ్రూట్స్ తో చేసిన ఈ కేకులు ఫంగస్ నుంచి మనల్ని రక్షిస్తాయి.
నిజానికి ఇతర కేకులతో పోలిస్తే ఫ్రూట్స్ కేక్ లు భలే రుచిగా ఉంటాయి.