బంకుల్లో పెట్రోల్, డీజిల్ సరఫరా మాత్రమే కాదు.. ప్రజలకు ఆరు సేవలు కూడా ఉచితంగా అందించాలి.

కానీ ఆ సేవలు ఏంటి? వాటిని ఎలా ఉపయోగించుకోవాలి అనేది మాత్రం చాలామందికి తెలియదు.

నార్మల్ గా అయితే బంక్ ఓనర్స్.. ఈ ఆరు సేవల్ని ఫ్రీగా అందిస్తామని ప్రభుత్వానికి చెబుతారు. అప్పుడే గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది.

ఒకవేళ బంకు యజమానులు.. ఈ ఆరు సేవల్ని ఉచితంగా అందించకపోతే మాత్రం మీరు సదరు బంకుపై ఫిర్యాదు చేయొచ్చు.

స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా టాయిలెట్స్, మరుగుదొడ్లని బంక్ ఓనర్స్ తప్పకుండా మెంటైన్ చేయాలి.

ఎందుకంటే మనం వాడే పెట్రోల్ పై దాదాపు 4-8 పైసలు.. కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లిస్తున్నాం.

బంకుల్లో ఉచితంగా మంచినీటి సదుపాయం కల్పించాలి. ఒకవేళ అలా లేకపోతే మాత్రం మీరు ఫిర్యాదు చేయొచ్చు.

ప్రతి వాహనానికి కూడా ఫ్రీగానే పెట్రోల్ నింపాలి. దీని కోసం ఎక్స్ ట్రాగా ఎలాంటి డబ్బులు తీసుకోకూడదు.

ప్రతి వాహనానికి కూడా ఎలాంటి అదనపు రుసుము తీసుకోకుండానే పెట్రోల్ నింపాలి. ఒకవేళ దీన్ని అతిక్రమిస్తే.. సదరు పెట్రోల్ బంక్ యజమానిపై ఫిర్యాదు చేయొచ్చు.

ఎవరికైనా సరే గాయమైతే బంకుల్లో ప్రథమ చికిత్స చేయాలి. దీని కిట్ కూడా పెట్రోల్ బంకుల్లో కచ్చితంగా ఉండాలి.

మనం వెళ్లే బంకుల్లో పెట్రోల్, డీజిల్ క్వాలిటీ తెలుసుకునే హక్కు మనకుంది. ఒకవేళ ఓనర్స్ దీన్ని నిరాకరిస్తే.. ఫిర్యాదు చేయొచ్చు.

అత్యవసర పరిస్థితుల్లో పెట్రోల్ బంక్ నుంచి ప్రజలు ఫోన్ వినియోగించవచ్చు. దీన్ని అడ్డుకోవడానికి లేదు.