హిందువులు వివిధ దేవుళ్ల మాలలు ధరించి..ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు.
అలాంటి దేవుళ్ల మాల ధరణల్లో అయ్యప్ప దీక్షమాల ఒకటి.
కార్తీక మాసం మొదలు మకర సంక్రాంతి వరకు అయ్యప్పదీక్షల కోలాహలం కనిపిస్తుంది.
అయ్యప్ప మండల దీక్షను 41 రోజులు అత్యంత నియమ నిష్టలతో చేస్తుంటారు.
అయ్యప్ప మండల దీక్షను 41 రోజులు అత్యంత నియమ నిష్టలతో చేస్తుంటారు.
దీక్ష ముగింపు సమయంలో ఇరుముడి కట్టుకుని అయ్యప్పను దర్శించుకుని వచ్చాక దీక్ష విరిమిస్తారు.
అసలు ఇరుముడి అంటే, వీటి వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
అయ్యప్ప దీక్ష ధరించిన వాళ్లు నల్లని దుస్తులు ధరిస్తారు. అన్నింటినీ స్వీకరించే గుణం నలుపు రంగుకు ఉంటుందట.
ఇరుముడి అంటే రెండు ముడులు కలది అని అర్థం. ఆ రెండూ భక్తి, శ్రద్ధకు ప్రతీక అనమాట.
అయ్యప్ప భక్తుల ఇరుముడికి కట్టే తాడు ప్రణవం.
భక్తి, శ్రద్ధలను సాధనతో పొందగలిగితే..స్వామి అనుగ్రహం లభిస్తుందని అందులోని ఆంతర్యం.
ఇరుముడి ఒక భాగంలో దేవుడికి సంబంధించిన సామగ్రి ఉంచుతారు.
రెండో భాగంలో నీళ్లు తొలగించిన కొబ్బరికాయలో ఆవునెయ్యిని నింపి ఉంచుతారు.
జీవాత్మ, పరమాత్మలను అనుసంధానం చేయడమే ఇందులోని ఆంతర్యం.
అయ్యప్ప మండల దీక్షలో సైంటిఫిక్ రీజన్ కూడ ఉంది.
ఏదైనా నియమాన్ని 21 నుంచి 41 రోజులు పాటిస్తే..ఆటోమెటిక్‌గా అది ఆ వ్యక్తికి అలవాటైపోతుంది.
కాబట్టి..సిగిరెట్,బీడి, మందు లాంటి వాటిని ఆ రోజుల్లో పక్కనపెడితే ఆ తరువాత వాటిపై వ్యామోహం ఉండదు.