గతేడాది బాలయ్య హోస్ట్ గా తెలుగు ఓటిటి  ఆహాలో ‘అన్ స్టాపబుల్’ షో మొదలైన సంగతి  తెలిసిందే.

అన్ని టీవీ షోలకు మించి సూపర్ హిట్ అవ్వడంతో  కొనసాగింపుగా ‘అన్ స్టాపబుల్ 2’  చేస్తున్నాడు బాలయ్య.

ఇప్పటికే ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తూ స్టార్ సెలబ్రిటీలను  షోకి ఇన్వైట్ చేస్తున్నాడు బాలయ్య.

దీంతో ఇదివరకే మహేష్ బాబు,  రవితేజ, అల్లు అర్జున్, నాని ఇలా మిగతా  హీరోలంతా కవర్ అయిపోయారు.

బాలయ్య షోలో పాన్ ఇండియా  స్టార్ ప్రభాస్ – మాచో స్టార్ గోపీచంద్  పాల్గొన్నారు.

బాలయ్య షో కోసం ప్రభాస్ కలర్ ఫుల్ చెక్ షర్ట్,  జీన్స్ లో ఎంట్రీ ఇచ్చాడు.

ఇప్పుడు ఫ్యాన్స్ అంతా ప్రభాస్ షర్ట్ పైనే కన్నేశారు.

లాగే అది ఏ బ్రాండ్, ధర ఎంత అనే  వివరాలు కూడా రాబట్టేశారు.

ప్రభాస్ వేసుకున్న షర్ట్ వివరాల్లోకి వెళ్తే..  ‘పోలో రాల్ఫ్ లారెన్ మెన్స్ మద్రాస్  బటన్ డౌన్ షర్ట్’’..

దీని ధర 115 పౌండ్స్. అంటే.. ఇండియన్  కరెన్సీలో సుమారు రూ. 11,618/-

కాగా ప్రస్తుతం ప్రభాస్ షర్ట్ గురించి సోషల్  మీడియాలో చర్చలు ఎక్కువైపోయాయి.

ఇక ప్రభాస్ తో పాటు గోపీచంద్..  ఎదురుగా హోస్ట్ బాలయ్య..

ఈ గ్రాండ్ ఎపిసోడ్ కోసం పాన్ ఇండియా ఫ్యాన్స్  వెయిట్ చేస్తున్నారు. 

మరి ప్రభాస్ షర్ట్ గురించి మీరేం అనుకుంటున్నారో  కామెంట్స్ లో తెలపండి.