పచ్చిమిర్చి మనలో చాలామందికి కన్నీళ్లు తెప్పిస్తుంది. అందుకే చలికాలంలో దీన్ని ఫుడ్ లో ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.
కూరకు అద్భుతమైన రుచిని అందించిన పచ్చిమిర్చిలో అద్భుత ఔషద గుణాలున్నాయి.
పచ్చిమిర్చిని ఆహారంలో క్రమం తప్పకుండా చేర్చుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
ఇందులో విటమిన్ సితో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల చర్మానికి ఎంతో మేలు. అలానే ముడతల్ని తొలగిస్తుంది.
ఇక పచ్చిమిర్చి తింటే జ్వరం, దగ్గు, జలుబు, లాంటి సమస్యలు దరిచేరవు.
అందుకే చలికాలంలో వీటిని వీలైనంత ఎక్కవగా ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.
పచ్చిమిర్చి, మెదడులో రక్తం గడ్డకట్టకుండా నివారిస్తుంది. ఇది తినడం వల్ల శరీరంలోని అన్ని భాగాలకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
మెదడులో ఎండార్ఫిన్లు ఎక్కువగా రిలీజ్ అవుతాయి. దీంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది.
ఏ వంటలోనైనా సరే మిర్చిని జతచేయడం వల్ల అందులో ఆరోగ్యకరమైన గుణాలు శరీరానికి చేరుతాయి.
పచ్చిమిర్చిలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. ఇది మీ ఎముకలు-దంతాలను బలపరుస్తుంది. అందుకే కూరల్లో కారంపొడి బదులు పచ్చిమిర్చి వాడితే మంచిది.
పచ్చిమిర్చి వల్ల పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది.
మరోవైపు నరాల సంబంధిత సమస్యలని కూడా పచ్చిమిర్చి నివారిస్తుంది. స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఆరోగ్యం జీర్ణం కావడానికి పచ్చిమిర్చి కారం చాలా ఉపయోగపడుతుంది. మెటాబాలిజం కూడా పెరుగుతుంది.