ఆహారాన్ని బాగా నిమిలి తినమని మన పెద్దలు తరచుగా చెప్తుంటారు.

వెనకాల ఎవరో తరుముతున్నట్లు కొందరు హడావుడిగా తింటుంటారు.

అయితే ఫాస్ట్  ఫాస్ట్ గా తినడం వలన ఏం జరుగుతుందో తెలిస్తే మళ్లీ అలా తినే సాహసమే చేయరు. 

సరిగ్గ నమలకుండా ఆహారం తినడం వలన ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. 

నమలకుండా ఆహారం తినడం వలన ముఖ్యంగా ఊబకాయం వస్తుంది. 

కొందరైతే ఆహారాన్ని నేరుగా మింగేస్తారు. దీనివల్ల అజీర్థి, కడుపు నొప్పి సమస్యలు వస్తాయి. 

త్వర త్వరగా తినే వాళ్లు ఇతరుల కంటే కొంచెం ఎక్కువ బరువు ఉంటారు. 

అల్పాహారం లేదా ఆహారాన్ని ఎప్పుడూ హడావిడిగా తినకూడదు. 

నమలకుండా ఆహారం తినడం అనేది ఇతర అనారోగ్యాలకు కూడా దారితీస్తుంది.

ఆఫీసుల్లో పనిచేసేవారు ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల శరీరంలో కొవ్వు పెరిగిపోతుంది. 

ఒత్తిడి కూడా విపరీతంగా బరువు పెరగడానికి దారితీస్తుంది.

ఒత్తిడి సమస్య దాదాపుగా ప్రతి ఒక్కరినీ వెంటాడుతూనే ఉంది.

ఒత్తిడి వల్ల మోతాదుకు మించి తింటుంటారు. ఇది ఊబకాయానికి దారితీస్తుంది. 

తినేటప్పుడు టీవీ చూడటం మంచింది కాదు. మీరు మీకు తెలియకుండానే ఎక్కువగా తింటారు. 

ఇలా నమలకుండా ఆహారం తినడం వలన ఊబకాయంతో పాటు ఇతర సమస్యలు దరిచేరుతాయి.