అయితే వెల్లుల్లిని నేరుగా తినడం కంటే.. మెులకెత్తినాక తింటే అధిక ప్రయోజనం కలుగుతుందని చెబుతున్నారు నిపుణులు.
వీటిని ఎలా మెులకెత్తించాలని మీకు అనుమానం రావొచ్చు. ఒక కప్పు గ్లాస్ వాటర్ తీసుకుని ఒక వెల్లుల్లి గడ్డని గానీ లేదా ఒక రెబ్బని గానీ తీసుకోవాలి.
వాటిని నీటిలో మెుత్తం మునగకుండా టూత్ పిక్ లను గుచ్చి వేర్లు వరకు మాత్రమే తడిచేలా వెల్లుల్లిని ముంచాలి.
దీనిని సూర్యరశ్మి తగిలే ప్రాంతాల్లో ఉంచితే బాగా మెులకెత్తుతాయి.
అనంతరం వాటిని నేరుగా లేదా ఆహారంతో కలిపి తీసుకోవచ్చు.
వాటి వలన కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
మెులకెత్తిన వెల్లుల్లిలో యాంటీ యాక్సిడెంట్లు అధిక మోతాదులో ఉంటాయి. దాంతో శరీరం ఇన్ ఫెక్షన్ల నుంచి రక్షణ పొందుతుంది.
వీటిల్లో ఉండే రసాయనాల వల్ల రక్త నాళాల్లో ఉండే కొవ్వు కరిగిపోతుంది.
దాంతో రక్త సరఫరా వృద్ధి చెంది.. గుండె జబ్బులు రాకుండా చేస్తుందని వైద్యులు సూచిస్తున్నారు.
వెల్లుల్లిలో ఉండే యాంటీ యాక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా కాపాడతాయి.
వీటిని తినడం వల్ల చర్మం యవ్వనంగా మారుతుంది. స్కిన్ పై ఉన్న ముడతలు పోయి.. కాంతివంతంగా కనిపిస్తుంది.
మెులకెత్తిన వెల్లుల్లి తినడం వల్ల బ్రెయిన్ షార్ప్ అవుతుందని, నాడులన్నీ ఉత్తేజితం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.