మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి కావాల్సినంత నిద్ర తప్పనిసరిగా ఉండాలి.

కావాల్సినంత నిద్రలేకుంటే మనకు ఆరోగ్య సమస్యలు వస్తాయి.

అలానే సరైన నిద్రతో పాటు మనం పడుకునే విధానం కూడా మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.

ఎడమ వైపున తిరిగి పడుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజానాలు ఉన్నాయంట

మరి.. ఎడమవైపు పడుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎడమవైపు తిరిగి  పడుకోవడం వలన జీర్ణక్రియ  మెరుగుపడుతుందని వైద్యులు అంటున్నారు.

ఎడమవైపు నిద్ర గురకను తగ్గించడంలో సహాయ పడుతుంది.

ఎడమవైపు పడుకోవడం వలన గుండెపై ఒత్తిడి తగ్గి.. రక్త ప్రసరణ జరుగుతుంది

వెన్ను నొప్పి నుండి ఉపశమనం కలిగించడంలో ఈ నిద్ర సాయపడుతుంది.

ఎందుకంటే ఈ స్థానం మీ వెన్నెముక సహజ వక్రతను కలిగి ఉంటుంది.

 ఎడమవైపు నిద్ర శోషరస వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది.

 ఎడమవైపు తిరిగి పడుకోవడం వలన శోషరస కణుపులను సమర్ధవంతంగా  పనిచేసేలా చేస్తుంది

 గర్భిణీ స్త్రీలు తరచుగా ఎడమవైపు పడుకోవాలని వైద్యులు సలహా ఇస్తారు.

 ఎందుకంటే ప్రసవం, ప్రీ క్లాంప్సియా వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

 ఎడమ వైపు తిరిగి నిద్రించడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.