భోజనం తర్వాత ఒక టేబుల్ స్పూన్ సోంపు తినడం వల్ల నోట్లో లాలాజలం ఎక్కువ ఉత్పత్తి అయ్యి ఎసిడిటీ సమస్య తగ్గుతుంది.
సోంపులో ఉండే ఫైబర్ మలబద్ధక సమస్యను తగ్గిస్తుంది.
రక్తహీనత ఉన్నవారు సోంపు తింటే మంచి ఫలితాలు ఉంటాయి. ఎర్ర రక్తకణాల ఉత్పత్తి పెరుగుతుంది.
సోంపు తినడం వల్ల రక్తపోటు కంట్రోల్ లో ఉంటుంది. రక్తం శుద్ధి అవుతుంది.
సోంపు తినడం వల్ల ముఖం మీద మొటిమలు తొలగిపోతాయి.
అధిక బరువును తగ్గించడంలో సోంపు బాగా పని చేస్తుంది.
సోంపుని వేయించి పొడిగా చేసి.. ఆ పొడిని గోరు వెచ్చని నీటిలో కలిపి తాగడం వల్ల శరీరంలో కొవ్వు కరుగుతుంది. దీని వల్ల బరువు తగ్గుతారు.
ఆస్తమా సమస్యలను దూరం చేసే గుణం ఈ సోంపుకి ఉంది.
సోంపు తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువని నిపుణులు చెబుతున్నారు.