ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ వాడకం ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు

పెద్దల దగ్గరనుండి పిల్లల వరకూ స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు

చుట్టూ మనుషులు లేకపోయినా చేతిలో మొబైల్ ఉంటే చాలు అనుకుంటున్నారు

చేతిలో మొబైల్ లేకపోతే అందరిలో ఏదో కోల్పోయిన ఫీలింగ్

గంటల తరబడి ఫోన్ లోనే కాలాన్ని గడుపుతున్నారు

సరికొత్త ఫీచర్స్ కారణంగా మొబైల్స్ కి బానిసలుగా మారుతున్నారు

అయితే ఛార్జింగ్ విషయానికి వచ్చేసరికి ఒక్కోసారి వేరే ఛార్జర్స్ వాడుతుంటారు

దానివల్ల మొబైల్స్ కి చాలా ప్రమాదం అనే సంగతి మర్చిపోతున్నార

మొబైల్స్ కి వేరే ఛార్జర్స్ వాడటం వల్ల జరిగే నష్టాలేమిటో చూద్దాం

వేరే ఛార్జర్స్ వాడటం వల్ల మొబైల్ బ్యాటరీ లైఫ్ టైమ్ తగ్గిపోతుంది

బ్యాటరీతో పాటు ప్రాసెసర్ దెబ్బతినే అవకాశం ఉంది

హీట్ ఎక్కువైతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందట

ఛార్జింగ్ పోర్టు పాడయ్యే ఛాన్సులు ఉన్నాయి

ఒక్కోసారి ఛార్జింగ్ వైర్ జాయింట్స్ ఉంటే వాడవద్దు

అలా చేయడం వల్ల కరెంట్ షాక్ తో మొబైల్స్ పేలే ప్రమాదం ఉంది

కాబట్టి మొబైల్స్ వాడకం, ఛార్జింగ్ ల విషయంలో జాగ్రత్తలు వహించడం మంచిది