గుడ్డును సూపర్ ఫుడ్, హెల్తీ ఫుడ్ అంటారు. ఎందుకంటే ఇది సంపూర్ణ ఆహారం.

గుడ్డు పోషకాల గని. ప్రతి రోజు ఉదయం టిఫిన్‌లో భాగంగా ఉడకబెట్టిన గుడ్డు తింటే రోజంతా ఎనర్జిటిక్ గా, హుషారుగా ఉండొచ్చు అంటారు నిపుణులు.

గుడ్డు తింటే ఆరోగ్యానికి మందిచి.. ఓకే కానీ..  అసలు రోజుకు ఎన్ని గుడ్లను తినాలి.. అది కూడా ఏ సమయంలో తినాలి.. ఒకవేళ​ ఎక్కువ సార్లు గుడ్డు తింటే ఏమవుతుందంటే..

పూర్తి ఆరోగ్యంగా ఉన్న ఓ యువకుడు.. రోజుకు ఒక్క గుడ్డు తింటే సరిపోతుంది. దీని ద్వారా ఒక రోజులో శరీరానికి సరిపడా పోష​కాలు అందుతాయి..

ఒకవేళ మీరు క్రమం తప్పకుండా ఎక్సర్‌సైజ్‌ చేసే వాళ్లయితే.. రోజుకు 3 కోడిగుడ్లు తిన్నా ఎలాంటి సమస్య ఉండదంటున్నారు నిపుణులు.

ఎందుకంటే ఎక్సర్‌సైజ్‌ చేసేవారికి ప్రోటీన్‌ అవసరం ఎక్కువగా ఉంటుంది. కనుక వీరు రోజుకు 3 గుడ్లు తినొచ్చు.

ఇక అతి సర్వత్రా వర్జయత్‌ అన్నట్లు.. రోజూకు ఒక ఉడక బెట్టిన గుడ్డును తింటే చాలు. పరిమితికి మించి తింటే మీరు డయేరియా బారిన పడొచ్చు.

దీనివల్ల మీ శరీరం బలహీనంగా తయారవుతుంది. అందుకే గుడ్లను అతిగా తినకండి. ఇది మిమ్మల్ని ప్రమాదంలో పడేస్తుంది.  

గుడ్లను మోతాదుకు మించి తింటే.. జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం చూపుతుంది. అంతేకాక ఇది మలబద్దకానికి దారితీస్తుంది.

ఇక కొన్ని సందర్భాల్లో అయితే కడుపులో చికాకు పుడుతుంది. అలాగ్యే గ్యాస్ట్రిక్ సమస్య కూడా తలెత్తుతుంది.

ఇక గుడ్డులో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో రకాల పోషకాలు లభిస్తాయని చెప్పుకున్నాం కదా.

అయితే గుడ్డు పచ్చసొనలో ఎక్కువ మొత్తంలో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. ఇది శరీరానికి ఎలాంటి హాని కలిగించనప్పటికీ.. కొలెస్ట్రాల్‌ పరిమాణాన్ని పెంచుతుంది.

అయితే గుడ్డు పచ్చసొనలో ఎక్కువ మొత్తంలో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. ఇది శరీరానికి ఎలాంటి హాని కలిగించనప్పటికీ.. కొలెస్ట్రాల్‌ పరిమాణాన్ని పెంచుతుంది.