మారుతున్న పోటీ ప్రపంచంలో చాలా మంది ఉద్యోగులు కూర్చీలకు అతుక్కుపోయి గంటలు గంటలు పని చేస్తుంటారు.
అలాంటి ఉద్యోగాలు చేసే చాలా మంది వ్యాయమాలు, యోగాలు లాంటివి చేయకుండా గుండె పోటు వంటి అనేక రకాల అనారోగ్య సమస్యలతో చిన్న వయసులోనే మరణిస్తూ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చి వెళ్తున్నారు.
ఇలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే వ్యాయమాలు, వాకింగ్, జిమ్ వంటివి చేయాలంటూ నిపుణులు సుచిస్తున్నారు.
ప్రతి రోజు ఎలాంటి రకాల వ్యాయమాలు చేయాలి? అసలు వ్యాయమాలు చేయకపోవడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటనేవి ఇప్పుడు తెలుసుకుందాం.
మన ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది వ్యాయమాలు చేయడమే మానేసి రోగాలను ఏరి కోరి తెచ్చుకుంటున్నారు.
ముఖ్యంగా వ్యాయమాల్లో భాగంగా ప్రతి రోజు వాకింగ్ చేయడం వల్ల బోలెడు లాభాలు దాగి ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రతి రోజు వాకింగ్ చేయడం వల్ల నాజుకు శరీరంతో పాటు ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు తెలియజేస్తున్నారు. రోజు వ్యాయమంలో భాగంగా నడక అనేది మనిషికి చాలా మంచిదట.
నడక అనేది మనిషిని ఒత్తిడి నుంచి బయటపడేలా చేయడంతో పాటు గుండె సంబంధమైన అనారోగ్య సమస్యలను దరిచేరనివ్వదట.
ఈ రోజుల్లో చాలా మంది స్థూల కాయంతో బాధపడుతుంటారు. అలాంటి వారు రోజు వాకింగ్ చేయడం వల్ల బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యంగా ఉంటారు.
క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం వల్ల అధిక రక్త పోటును అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
రోజు వాకింగ్ చేయడం ద్వారా కండరాలకు బలం చేకురడంతో పాటు ఎముకలు కూడా బలపడతాయి.
ప్రతిరోజు వాకింగ్ చేయడం ద్వారా అనారోగ్య సమస్యల నుంచి బయటపడడంతో పాటు ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.