అమ్మతనం తోనే స్త్రీకి పరిపూర్ణత్వం లభిస్తుంది అంటారు పెద్దలు.

ఆ అమ్మతనం కోసం పెళ్లైన ప్రతీ మహిళ ఆరాటపడటం సహజం.

ఐతే గర్భిణీ అయ్యాక వారిలో చాలా అపోహలు.. అనుమానాలు ఉంటాయి.

ముఖ్యంగా ప్రెగ్నెన్సీ సమయంలో ఏం తినాలో.. వారికి సరైన అవగాహన ఉండదు.

కొందరు ఇటువంటి సమయాల్లో ఎక్కువగా జ్యూస్ లు తాగాలి అని చెబుతారు. మరి చెరుకు రసం తాగాలా? వద్దా? అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది.

చాలా మంది వైద్య నిపుణులు ప్రెగ్నెన్సీ సమయంలో చెరకు రసం తీసుకోవచ్చని చెబుతున్నారు. ఈ రసం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

చెరుకు రసంలో ముఖ్యంగా విటమిన్-ఎ, బి1, బి2 బి6, బి5, విటమిన్ సి లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కాక ఐరన్, మెగ్నీషియం లాంటి పోషకాలు కూడా ఉన్నాయి.

గర్భాధారణ సమయంలో మీకు షుగర్ ఉంటే మీరు చెరుకు రసం తాగడం తగ్గించాలి. ఇది మీరు గుర్తుంచుకోవాలి.

చెరుకు రసం తాగడం వల్ల మలబద్దకం నుంచి ఉపశమనం పొందడమే కాకుండా.. కడుపులో ఇన్ఫెక్షన్ల నుంచి కూడా రక్షిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

చెరుకు లో ఉండే పాలీఫెనాల్స్ బరువును నియంత్రించడంలో, జీవక్రియ స్పీడ్ ను పెంచడానికి తొడ్పడతాయి.

యూరిన్ ఇన్పెక్షన్ల నుంచి చెరుకు రసం అద్భుతంగా కాపాడుతుంది. 

దీనిని రోజూ తాగడం వల్ల మెుటిమల నుంచి దూరం కావోచ్చు.