సాధారణంగా రోజంతా కష్టపడి పని చేసేవారంతా అలసటకు గురవుతారని విషయం తెలిసిందే

కొందరు ఒళ్ళు నొప్పులు, తలనొప్పి అంటారు.. ఇంకొందరు కీళ్లు, కాళ్ళ నొప్పులని చెబుతుంటారు

అయితే.. అలసిపోయిన వారికి కాళ్ళు, కీళ్ల నొప్పులుంటే సరిగ్గా సరిగ్గా నిద్రపోలేమని వాపోతుంటారు

అందుకే కొందరు నిద్రపోయే ముందు మోకాళ్ళు లేదా పాదాల కింద దిండు(పిల్లో) పెట్టుకుంటారు

ముఖ్యంగా గర్భధారణ సమయంలో మహిళలు పాదాల కింద దిండు పెట్టుకోవడం మనం చూస్తుంటాం

అసలు కాళ్ళ కింద దిండు పెట్టుకోవడం ఏంటి? ఏమైనా లాభాలున్నాయా? అంటే అవునని అంటున్నాయి నివేదికలు

పాదాల క్రింద దిండు పెట్టుకుని నిద్రపోవడం వల్ల పూర్తి రిలాక్స్ ఫీల్ పొందగలరు

మీ కాళ్ళ కింద దిండు పెట్టుకుని పడుకుంటే ఒత్తిడి దూరమై మంచి నిద్ర లభిస్తుంది

ఎప్పుడైనా పడుకునేటప్పుడు కాళ్లకింద దిండు పెట్టుకుని పడుకుంటే కాళ్లలో వాపు తగ్గుతుంది

నిలబడి పనిచేసేవారు కాళ్ళ కింద దిండు పెట్టుకుంటే నడుము, వెన్ను నొప్పులు తగ్గుతాయి

అలాగే కాళ్ళ కింద దిండు పెట్టుకొని రెస్ట్ తీసుకోవడం వల్ల శరీరంలో రక్తప్రసరణ బాగా జరుగుతుంది

దిండుపై కాళ్లు పెట్టుకుని పడుకుంటే డిస్క్ పెయిన్(బ్యాక్ పెయిన్) నుంచి ఉపశమనం పొందవచ్చ