బరువు తగ్గాలనుకునే వారికి సైతం ఈ లెమన్ టీని ఎంతోగానో ఉపయోగపడుతుంది. దీంతో చాలా మంది లెమన్ టీని తీసుకుంటుంటారు.
లెమన్ టీ జీవక్రియను వేగవంతం చేయడానికి పని చేస్తుందట. దీంతో పాటు ఉబ్బరం నుంచి కూడా ఉపశమనం కలిగించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
లెమన్ టీలో అల్లం జోడించడం వల్ల యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చాలా పుష్కలంగా ఉంటాయి. అల్లం వికారం సమస్యను అధిగమించడానికి బాగా సహాయపడుతుంది.
అంతే కాకుండా లెమన్ టీ తాగడం ద్వారా శరీరంలో ఐరన్ లోపాన్ని కూడా నివారించడానికి బాగా పనిచేస్తుందట.
ఇలాంటి సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే మోతాదులో లెమన్ టీ తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.