నగరాల్లో ఉండే యువత యువకులు నోటికి ఏది రుచిగా అనిపిస్తే అది ఎంచక్కా లాగేస్తున్నారు.

అలా ఏది పడితే అది తింటూ చివరికి లేనిపోని రోగాల బారిన పడుతున్నారు. 

చాలా మంది ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇక ఇందులో భాగంగానే ఉదయాన్నే మొలకెత్తిన గింజలు తీంటుంటారు. 

మొలకెత్తిన గింజలు తినడం ద్వారా లాభాలు ఏంటి? నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. 

మొలకెత్తిన గింజలు తీసుకోవడం ద్వారా చాలా రకాల లాభాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా మొలకెత్తిన మెంతుల్లో పొటాషియం, కాపర్, పోలిక్ యాసిడ్, ఐరన్, మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. 

మెంతులను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఆ మొలకెత్తిన మెంతులను తీసుకోవాలి. 

అలా మొలకెత్తిన మెంతులను తీసుకోవడం ద్వారా రోగనిరోదక శక్తి పెరుగుతుంది. 

అధిక కొలెస్ట్రాల్ ను కరిగించడమే కాకుండా హైపర్ టెన్షన్ ను కంట్రోల్ లో ఉంచుతుంది. 

 జీర్ణక్రియ సంబంధమైన రోగాలు రావడమే కాకుండా జీర్ణక్రియ సులభంగా జరిగేలా దోహదపడుతుంది.

మొలకెత్తిన మెంతులు తీనడం ద్వారా కండరాలు గట్టిపడి, కీళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. 

మొలకెత్తిన మెంతులు తింటే గుండె సంబంధమైన రోగాలను కూడా రాకుండా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.