సపోటాలు చాలా తియ్యని రుచిని కలిగి ఉంటాయి.. కేవలం రుచి మాత్రమే కాదు మంచి ఆరోగ్యాన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

సపోటాలో  గింజలు తీసివేసి...   సలాడ్లు, మిల్క్ షేక్‌లు, జ్యూస్‌లలో కోసం వాడుతుంటారు. వేసవిలో చాలా మంది సపోట జ్యూస్ అంటే ఇష్టపడతారు. 

సపోటలో ఉండే ఎ, సి విటమిన్లు కంటి చూపు కాపాడుతాయి.. అంతేకాదు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. 

సపోట పండు తినడం వల్ల శరీరంలోని విష వ్యర్థాలన్ని బయటకు పంపుతాయి.. గుండెను కాపాడుతాయి. 

 శరీరంలో అధికంగా వేడి ఉంటే.. సపోటాలు తినాలి. వీటిలో ఉండే టాన్నీన్ వేడి పోగొట్ట చలువ చేస్తుంది. 

సపోటాలో సపోటాల్లో సహజసిద్ధమైన ఫ్రక్టోజ్‌, సుక్రోజ్‌లు ఉంటాయి. దీని వల్ల శరీరంలో తక్షణమే శక్తి లభిస్తుంది.

 సపోటాల్లో  యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు పుష్కలంటా ఉంటాయి.. వీటి వల్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి.

 ఈ పండులో సపోటాల్లో ఫైబర్‌, విటమిన్ ఎ, బి, సి, యాంటీ ఆక్సిడెంట్లు అధిక మొత్తంలో ఉంటాయి.. ఇవి క్యాన్సర్ కి చెక్ పెడతాయి.

సపోటాల్లో  ఐరన్‌లు,కాల్షియం, ఫాస్ఫరస్‌, పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలకు బలాన్ని చేకూరుస్తాయి.

సపోటాల్లో సమృద్దిగా  ఐరన్‌ ఉంటుంది.. దీనివల్ల రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. 

సపోటా తినడం వల్ల ఇందులో ఉండే ఎలక్ట్రోలైట్స్‌, విటమిన్‌ ఎ  వికారం, వాంతుల సమస్యలకు చెక్ పెడుతుంది.

సపోటాలు గర్భిణీలకు, పాలిచ్చే తల్లులకు  ఎంతగానో మేలు చేస్తాయి.

సపోటాలు బరువును తగ్గించేందుకు ఎంతో సహాయపడుతుంది.