పొద్దున్నే లేవగానే చాలా మంది ఎన్నో రకాల మొలకెత్తిన గింజలు తింటూ ఉంటారు.
మరీ ముఖ్యంగా ఇలాంటి మొలకెత్తిన గింజలను ఎక్కువగా జిమ్ చేసే వ్యక్తులు తింటుంటారు.
అయితే మొలకెత్తిన గింజలు తినడం వల్ల ఎలాంటి రకాల ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి, వైద్య నిపుణులు ఏం చెబుతున్నారనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మన శరీరానికి ప్రోటిన్లు అందించే గుణాలు మొలకెత్తిన గింజల్లో ఉంటాయని, తీసుకునే రోజు వారి ఆహరంలో ఖచ్చితంగా మొలకెత్తిన గింజలు ఉండేలా చూసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
శరీరంలో కొవ్వులేని బాడీ కోసం ప్రయత్నించేవారు పెసల మొలకలు తీసుకుంటే ఎన్నో రకాల ప్రయోజనాలున్నాయి.
పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం, విటమిన్ బి వంటి పోషకాలు మొలకెత్తిన గింజల్లో పుష్కలంగా ఉంటాయి.
ఇందులో ఫైబర్ తక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గడానికి ప్రయత్నించేవారికి ఈ మొలకలు ఉపయోగపడతాయని నిపుణులు తెలియజేస్తున్నారు.
పెసల మొలకలు జీర్ణక్రియ వ్యవస్థకు చాలా ఉపయోగపడతాయి. పైగా తిన్న ఆహారం కూడా తొందరగా జీర్ణమవుతుంది.
పెసల మొలకల్లో అధికంగా ఐరన్ ఉంటుంది. ఇవి తీసుకోవడం వల్ల రక్త హీనత సమస్య నుంచి భయటపడొచ్చు.
పెసల మొలకల్లో వైటెక్సిన్, ఐసోవిటెక్సిన్ వంటివి ఉండడం ద్వారా రక్తంలో చెక్కర స్థాయిని తగ్గించేందుకు ఉపయోగపడతాయట.
పెసల మొలకలు తినడం ద్వారా ఎముకలు దృఢంగా మారతాయని నిపుణులు చెబుతున్నారు.
మొలకెత్తిన పెసల మొలకలు తీసుకోవడం ద్వారా పైన తెలిపిన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
పెసల మొలకలు తినడం ద్వారా ఇన్ని రకాల ఉపయోగాలు దాగి ఉన్నాయి. మరి ఇంకేందుకు ఆలస్యం వెంటనే ట్రై చేయండి.