ఒకప్పుడు మాత్రం భోజనం చేసిన తర్వాత బెల్లాన్ని తప్పకుండా తినేవాళ్లు.

మనకు లేదు కానీ మన పెద్దలు ఇప్పటికి కూడా  ఈ అలవాటు  పాటిస్తుంటారు. 

భోజనం చేసిన తరువాత బెల్లం తినడం వల్ల  ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

సాధారణంగా బెల్లాన్ని ఎప్పుడైనా ఆరోగ్యానికి చాలా మంచిదే.

అయితే భోజనం చేసిన తరువాత తినడం వల్ల జీర్ణవ్యవస్థ బలోపేతం అవుతుంది. 

బెల్లంలో కాల్షియం, ఐరన్, విటమిన్ సి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. 

రెగ్యులర్ గా బెల్లం తినేవారికి పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది.

తరచూ బెల్లం తినడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.

పిల్లలు, వృద్ధులు బెల్లాన్ని ఖచ్చితంగా తినాలని ఆరోగ్య నిపుణులు సలహానిస్తున్నారు.

బెల్లం తినడం వల్ల కడుపులో గ్యాస్, అజీర్ణ సమస్యలను రాకుండా చేస్తుంది.

భోజనం చేసిన వెంటనే స్వీట్లను తినే బదులుగా బెల్లాన్ని తినడం అలవాటు చేసుకోండి. 

రెగ్యులర్ గా బెల్లం తినడం వల్ల మీ శరీరానికి తగినంత కాల్షియం అందుతుంది.

పిల్లలకు బెల్లం  తరచు తినిపించడం వల్ల వారి ఎముకలు బలంగా, ఎదుగులదల కలిగి ఉంటాయి. 

క్రమం తప్పకుండా భోజనం చేసిన తర్వాత బెల్లాన్ని తింటే కండరాల సమస్యల పోతుంది. 

రక్తంలో హిమోగ్లోబిన్ పెరగాలంటే ఇతర ఆహారాలతో పాటుగా బెల్లాన్ని కూడా తినాలి.

బెల్లం తినడం వల్ల మీ శరీరానికి తక్షణ శక్తి కూడా అందుతుంది. 

భోజనం తర్వాత బెల్లం తినడం వల్ల ఊబకాయం కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

చక్కెర, ఇతర స్వీట్ల కంటే బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది.

ప్రతిరోజూ బెల్లం తినడం వల్ల రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. 

బెల్లం మీ శరీరంలో వేడిని కాపాడుతుంది. అంతేకాక జలుబు చేసే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.