జీడి పప్పు రుచిగా ఉండటమే కాదు.. శరీరానికి ఎంతో శక్తి ఇస్తుంది.

జీడి పప్పులో ఉండే ప్రోటీన్, ఫైబర్,  యాంటి ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో సహకరిస్తుంది. 

జీడిపప్పు కాపర్ గుణాలను కలిగి ఉండటం వల్ల రక్తానికి సంబంధించిన రోగాలను మాయం చేస్తుంది.

జీడిపప్పు తింటే ఇందులో ఉండే జియా క్శాంటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ పిగ్మెంట్ ఇన్ఫెక్షన్లతో బాధపడేవారికి ఉపశమనం ఇస్తుంది

జీడి పప్పు తినడం వల్ల అధిక రక్తపోటు, గుండెపోటు  స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. 

జీడి పప్పు లో ఉండే పోషక పీచు కొలెస్ట్రాల్ స్థాయిని, రక్తపోటును వాపును చాలా వరకు తగ్గిస్తుంది. 

జీడిపప్పులో సెలీనియం, జింక్, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్‌ ఉంటాయి. చర్మానికి ఎంతో మేలు జరుగుతుంది.

జీడి పప్పు క్రమం తప్పకుండా తింటే.. జిడ్డు చర్మం ఉన్నవారికి  చాలా రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. 

జీడి పప్పు లో ఉండే పోషకాలు క్యాన్సర్ ను నివారించడంలోనూ సహాయపడతాయి. 

జీడి పప్పులో ఉండే డైటరీ ఫైబర్లు ఆహరాన్ని త్వరగా జీర్ణం చేయడంలో సహాయపడతాయి. అలాగని జీడిపప్పు అతిగా తింటే ప్రమాదమే..

జుట్టును మృదువుగా ఉంచడంలో, రంగును పెంచడంలో  జీడిపప్పు ఎంతో సహాయపడుతుంది. 

జీడిపప్పు తినడం వల్ల వృద్ధాప్యం వల్ల వచ్చే కంటి చూపు సమస్యలకు చెక్ పెట్టవొచ్చు

జీడిపప్పులో జియా క్శాంటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ పిగ్మెంట్ ఉండటం వల్ల కంటి సమస్యలు దూరం పెట్టవొచ్చు.