మనం తయారు చేసుకునే తీపి వంటకాల్లో రుచి, వాసనకు యాలకుల పొడిని వేస్తుంటాం.

అయితే కేవలం తీపి పదార్థాల్లోనే కాకుండా ఇతర వంటకాల్లో కూడా యాలకుల ఉపయోగిస్తాం. 

యాలకుల వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది.

పలు రకాల అనారోగ్య సమస్యలను  యాలకులను ఉపయోగించి నయం చేసుకోవచ్చు. 

యాలకులను వంటల్లో తీసుకోవడం వల్ల కలిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

యాలకుల పొడిని కొద్ది మోతాదులో ప్రతిరోజూ తీసుకోవడం వల్ల బరువు పెరగకుండా ఉంటారు. 

శరీరంలో ఉండే కొవ్వును కరిగించడం, జీవక్రియల రేటును పెంచడంలో యాలకులు మనకు సహాయపడతాయి. 

శరీరానికి చలువ కలిగించే గుణాన్ని యాలకులు కలిగి ఉంటాయి.

ఆయుర్వేదంలో శరీరంలోని నొప్పులను తగ్గించడంలో యాలకులను వాడుతారు.

యాలకులను మెత్తగా నూరి నుదుటికి రాసుకోవడం వల్ల తలనొప్పి తగ్గుతుంది. 

యాలకుల గింజల నమ్మలడం వల్ల నోట్లో ఉండే క్రిములు నశించి నోటి దుర్వాసన తగ్గుతుంది

యాలకులను మిశ్రమాన్ని గాయాలకు లేపనంగా రాయడం వల్ల అవి త్వరగా మానుతాయి.

యాలకులను నోట్లో వేసుకుని నమలడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గు ముఖం పడతాయి. 

యాలకులను వాసన చూడడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. 

యాలకులు అనేక రకాల సమస్యలను నయం చేస్తాయని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు.