తినే ఆహారంలో కొన్ని మార్పులు, సకాలంలో నిద్రపోవడం వంటి వాటితో జీర్ణ సమస్యలు తగ్గించుకోవచ్చు.
రోజూ వ్యాయామాలను క్రమం తప్పకుండా చేయడం ద్వారా జీర్ణ సమస్యలు తొందరగా తగ్గిపోతాయి.
జీర్ణ సమస్యల నుంచి బయటపడటానికి అరటి పండు ఎంతగానో ఉపయోగపడుతుంది.
అన్నం తిన్న తరువాత అరటిపండును చిన్న ముక్కలుగా చేసి.. చిటికెడు నల్ల మిరియాల పొడి, ఉప్పును చల్లి తినండి.
అరటి పండులోని ఫైబర్ కంటెంట్ జీర్ణ క్రియను సులభతరం చేయడానికి చాలా సహాయపడుతుంది.
చిలగడదుంపలు, పెరుగు, కూరగాయలు, పండ్లు, మూలికా టీలు మలబద్దకాన్ని నివారిస్తాయి.
జీలకర్ర నీళ్లు వంటి అనేక ఆహార పానీయాలు కూడా మలబద్దక సమస్యను తొలగిస్తాయి.
జీర్ణ సమస్యను పరిష్కరించడానికి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్నిఎక్కువగా తీసుకోవాలి.
జీర్ణ సమస్యలు తగ్గడానికి కంటినిండా నిద్ర, శారీరక శ్రమ కూడా అవసరం.
అలానే మరికొన్ని చిట్కాలను పాటించడం ద్వారా జీర్ణ క్రియ సమస్యలు తొలగిపోతాయి.
గమనిక: ఇది కేవలం అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. అవగాహన కోసం నిపుణులను సంప్రదించవలసిందిగా మనవి.