మనం ప్రతి రోజూ తీసుకునే టిఫిన్స్‌లో ఇడ్లీది ఓ ప్రత్యేకస్థానం.

నూనె అస్సలు వాడరు కాబట్టి చాలా మంది ఇడ్లీలను తినటానికి ఇష్టపడుతుంటారు.

కొంతమంది సాధారణంగానే ఇడ్లీలంటే చాలా ఇష్టం.

ఇక, మనం ఎంతగానో ఇష్టపడే ఇడ్లీకి ఘనమైన చరిత్రే ఉంది.

ఈ ఇడ్లీ 7-12 శతాబ్ధం మధ్య కాలంనుంచే అందుబాటులో ఉంది.

అందరూ అనుకున్నట్లు ఇడ్లీ భార​త్‌కు చెందినది కాదు.

ఇడ్లీ మొట్ట మొదటి సారి ఇండోనేషియాలో తయారు అయింది.

దీన్ని అక్కడి భాషలో కెడ్లి, కెడరీ అని అంటారు.

ఆ కాలంలో హిందూ రాజులు ఇండోనేషియాను పరిపాలించేవారు. అక్కడినుంచి ఇక్కడకి వచ్చినపుడు వంటగాళ్లను కూడా వెంట తెచ్చుకునేవారు.

ఇక్కడికి వచ్చినపుడు కూడా బంధుమిత్రులతో కలిసి ఇడ్లీ చేయించుకు తినేవారు.

ఇండోనేషియాకు చెందిన కెడ్లీ కాస్తా ఇండియాకు వచ్చి ఇడ్లీగా మారిపోయింది.

ఈ విషయాలను కర్ణాటకకు చెందిన ఆహార చరిత్రకారుడు కేటీ ఆచార్య వెల్లడించారు.