చాలా వరకు వేసవి కాలంలో కాటన్‌ దుస్తులు ఎక్కువగా ధరిస్తారు.

అయితే కొందరు మాత్రం సీజన్‌తో పని లేకుండా.. అన్ని కాలాల్లో కాటన్‌ దుస్తులు ధరించడానికి ఇష్టపడతారు.

అయితే మిగతా దుస్తులతో పోలిస్తే.. కాటన్‌ వస్త్రాలను శుభ్రం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

లేదంటే త్వరగా రంగుపోయి.. పాతవాటిలా మారతాయి. అలా కాకుండా ఉండాలంటే..

కాటన్‌ దుస్తులను ఉతికేటప్పుడు వాటి లేబుల్‌పైన ఎలా ఉతకాలో రాసి ఉంటుంది. ఆ సూచనలు పాటించాలి.

ఇక 100 శాతం కాటన్‌ ధరించడానికి ఇష్టపడే వ్యక్తులు.. వాటిని తప్పకుండా డ్రై క్లీనింగ్‌ చేయించాలి.

అలానే బట్టలు ఉతికిన తర్వాత వెంటనే వాటిని ఎండలో ఆరబెట్టకూడదు. ఇలా చేస్తే.. త్వరగా పాడవుతాయి.

అందుకే కాటన్‌ దుస్తులను ఉతికాక.. ముందుగా నీడలో ఆరబెట్టిన తర్వాత.. వాటిని ఎండలో ఆరబెట్టాలి. ఇలా చేస్తే రంగు పోదు.

అలానే కాటన్‌ దుస్తులను ఐరన్‌ చేసేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

ఎక్కువ వేడిని ఉపయోగించి కాటన్‌ దుస్తులను ఐరన్‌ చేయకూడదు. అలా చేస్తే త్వరంగా రంగు పోతాయి.

అంతేకాక కాటన్‌ దుస్తులను కాస్త తడిగా ఉండగానే ఐరన్‌ చేయడం మంచింది.

ఇక ఐరన్‌ చేసిన తర్వాత వీటిని.. ఓ పేపర్‌లో చుట్టి.. పెట్టడం వల్ల.. ఐరన్‌ పాడవ్వకుండా ఉంటుంది.

ఇలా చేయడం వల్ల కాటన్‌ దుస్తులు ఎక్కువ కాలం కొత్త వాటిలా ఉంటాయి.