పవర్‌ స్టార్‌, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌.. రాజకీయాల్లో క్రీయాశీకలంగా వ్యవహరిస్తున్నారు. 

ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికలకు కేవలం ఏడాదిన్నర సమయం మాత్రమే ఉంది.

రాబోయే అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు జనసేనాని. అందుకు తగ్గట్టుగానే యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేసుకుంటున్నాడు.

ఎన్నికల సమీపిస్తోన్న తరుణంలో.. ఇక నిత్యం ప్రజా క్షేత్రంలో ఉండేలా జనసేనాని ప్లాన్‌ చేసుకుంటున్నాడు. దానికి తగ్గట్లు.. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించడం కోసం ప్రత్యేక వాహానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.

ఎన్నికల యుద్ధంలో పాల్గొనడానికి వారాహి రెడీగా ఉంది అంటూ.. ఈ వాహనానికి సంబంధించిన వీడియోని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు పవన్‌ కళ్యాణ్‌. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది.

వాహనం డిజైన్‌తో పాటు.. దాని పేరు కూడా చాలా భిన్నంగా ఉండంటంతో.. ప్రస్తుతం నెటిజనులు.. దీని గురించి తెగ చర్చించుకుంటున్నారు.

అసలు వారాహి అనే పేరుకు అర్థం ఏంటి.. ఎందుకు పవన్‌ కళ్యాణ్‌ తన వాహనానికి ఈ పేరు పెట్టాడు అంటూ తెగ సర్చ్‌ చేస్తున్నారు. పవన్‌ ఎన్నికల యుద్ధం కోసం సిద్ధం చేయించిన వాహనం పేరు వారాహి.

ఈ పేరు వెనక ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. పురణాల గురించి తెలిసిన వారికి విష్ణుమూర్తి వరాహా అవతారం గురించి తెలిసే ఉంటుంది. విష్ణువు దశవాతారాల్లో వరహ అవతారం ఒకటి.

హిరణాక్షుడు అనే రాక్షసుడు వేదాలను దొంగిలించి.. భూమిని సముద్రంలో దాచేస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి వరాహ అవతారం ఎత్తి.. హిరణాక్షుడిని సంహరించి.. వేదాలను కాపాడి.. భూమిని ఉద్ధరిస్తాడు.

ఇక పవన్‌ కళ్యాణ్‌ తన ఎన్నికల ప్రచార రథానికి ఈ పేరు పెట్టడం వెనక బలమైన కారణముంది అంటున్నారు జనసేన నేతలు. సమస్యలతో సతమతమవుతున్న ప్రజలను చైతన్య పరిచి..

వారి ఎదుర్కొటున్న సమస్యలపై పోరాటం చేసి.. ప్రజల్లో రాజకీయ చైతన్యం తేవాలనే ఉద్దేశంతో పవన్‌ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నాడు.

కనుక దాన్ని ప్రతిబింబించేలా ఆయన ప్రచార రథానికి వారాహి అనే పేరు పెట్టారు అంటున్నారు జనసైనికులు. పేరు వెనక ఉద్దేశం ఏదైనా.. దీని గురించి మాత్రం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు.

అలానే వారాహి అనే దేవత పేరు మీదుగా.. ప్రచార రథానికి ఈ పేరు పెట్టారని మరి కొందరు అంటున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం వారాహి అనే పేరు ట్రెండింగ్‌లో ఉంది.

పవన్‌ కల్యాణ్‌ ప్రచారం రథం వారాహి మాత్రం యుద్ధానికి సిద్ధంగా ఉన్న ఆర్మీ ట్యాంకర్‌లా ఉంది. ఈ వాహానికి తొలుత కొండగట్టులో పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఏపీలో ఎన్నికల ప్రచారంలోకి దిగుతుంది అని తెలిపారు.

ఇక ఈ వాహనానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రత్యేకించి.. దీనిలో స్పెషల్‌ లైటింగ్.. ఆధునిక సౌండ్ సిస్టమ్స్ అందుబాటులో ఉన్నాయి.

గతంలో.. పవన్ పర్యటనల సందర్బంగా పలు మార్లు విద్యుత్ నిలిపివేసిన సందర్భాలున్నాయి అంటుంది జనసేన. వాటిని దృష్టిలో పెట్టుకుని.. వారాహి వాహనంలో ప్రత్యేకంగా లైటింగ్ ఏర్పాట్లు చేశారట.

అంతేకాక జనసేనాని ప్రసంగం వేల మందికి స్పష్టంగా వినిపించే విధంగా ఆధునిక సౌండ్ సిస్టం ఏర్పాటు చేశారు. ఈ వారాహికి నలువైపులా సీసీ కెమెరాలు అమర్చారు.

అంతేకాదు ప్రచార రథం లోపల పవన్ కళ్యాణ్‌తో పాటు మరో ఇద్దరు కూర్చొని చర్చించుకునేలా ఏర్పాట్లు చేశారు.

అక్కడి నుంచి హైడ్రాలిక్ విధానంలో మెట్లు ఉంటాయి. వాటి ద్వారా వాహనం మీదకు ఎక్కే ఏర్పాటు చేశారు.