ప్రస్తుత జీవన విధానం వల్ల 30 ఏళ్లు దాటకముందే ముఖంపై ముడతలు వచ్చేస్తున్నాయి. వీటి వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది.

ఇష్టం వచ్చింది తినడం, లేటుగా నిద్రపోవడం, అనారోగ్యకర లైఫ్ స్టైల్ వల్లే ఇలా తయారవుతున్నారు.

ఆల్కహాల్ తో మీ అందాన్ని మెరుగుపరుచుకోవచ్చట. వోడ్కా, వైన్.. మన సౌందర్యాన్ని పెంచేందుకు ఉపయోగపడతాయట.

రెడ్ వైన్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. దీన్ని ముఖంపై అప్లై చేయడం వల్ల నల్లటి వలయాలు, ముడతలు తొలిగిపోతాయి.

రెడ్ వైన్ కు కొద్దిగా తేనే కలిపి ముఖానికి అప్లై చేసి, 10-15 నిమిషాలు ఉంచితే చర్మం తాజాగా అవుతుంది.

సగం బాటిల్ బీర్ ని గోరువెచ్చని నీటిలో కలిపి, కాళ్లను 20 నిమిషాలు అందులో ముంచండి. 

బీర్ లోని సహజ యాంటీ సెప్టిక్ కాలిగోర్లను శుభ్రపరుస్తుంది. పాదాలను మృదువగా మారుస్తుందట.

ఉప్పు, ఆలివ్ ఆయిల్, కొద్దిగా నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని చర్మంపై వలయాకారంలో రుద్దండి. ఇది శరీరంపై నిర్జీవ కణాలని తొలగించి, మృదువుగ మారుస్తుంది.

మద్యాన్ని పాదాలకు అప్లై చేస్తే.. నొప్పులు లాంటివి ఏమైనా ఉన్నాసరే మటుమాయం అవుతాయట.

బయట తిరగడం వల్ల జట్టు పొడిబారి అనారోగ్యానికి గురవుతాయి. ఇలాంటప్పుడు జట్టుని షాంపుతో వాష్ చేసిన తర్వాత తక్కువ గాఢత గల బీర్ లో ముంచండి.

ఇలా చేయడం వల్ల మీ జట్టు మృదువుగా మారడమే కాకుండా, తలపై చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందట.

కాబట్టి మద్యాన్ని తాగి ఆరోగ్యం పాడుచేసుకోకుండా.. ఇలా చిన్న చిన్న టిప్స్ పాటించి మీ అందాన్ని రెట్టింపు చేసుకోండి.