చెట్టు నుంచి అప్పుడే తీసిన తాటి కల్లులో శరీరానికి మేలు చేసే సూక్ష్మక్రిములు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.
తాటి కల్లులో 53 రకాల సూక్ష్మక్రిములు ఉంటాయని, వాటిలో ఉండే 18 రకాల సూక్ష్మక్రిములు శరీరంలో వ్యాధికారక క్రిములను నాశనం చేస్తాయని పరిశోధకులు వెల్లడించారు.
తాటి కల్లులో ఉండే చఖరో మైసెస్ అనే సూక్ష్మజీవి ఉంటుంది.
ఇది మనిషి కడుపులో క్యాన్సర్ కి కారణమయ్యే ఓబీఎస్ 2 క్యాన్సర్ కారక కణాలను నశింపజేస్తుంది.
తాటి కల్లు తాగడం వల్ల డయేరియా, టైఫాయిడ్ వంటి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.
జీర్ణ వ్యవస్థను బాగు చేయడంలో తాటి కల్లు బాగా పని చేస్తుంది.
ఉదయాన్నే పరగడుపున తాటి కళ్ళు తాగడం వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
పొద్దున్నే తాటి కల్లు తాగడం వల్ల కడుపులో ఉన్న వ్యర్థాలన్నీ బయటకు పోతాయి. దీంతో శరీరం లోపల శుభ్రంగా ఉంటుంది.
పులిసిన లేదా పుల్లగా ఉన్న తాటి కల్లు తాగితే అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు.
చెట్టు నుంచి తీసిన గంట లోపే తాగేయాలని అంటున్నారు. లేదంటే అందులో బ్యాక్టీరియా వృద్ధి చెంది అనారోగ్యానికి దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు.
తాజాగా అప్పటికప్పుడు తీసిన తాటి కల్లు తాగితేనే ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఇది కేవలం ఇంటర్నెట్ నుంచి సేకరించిన సమాచారం మాత్రమే. దీని మీద పూర్తి అవగాహన కోసం నిపుణులను అడిగి తెలుసుకోవాల్సిందిగా మనవి.