రోజూ ర‌న్నింగ్ చేయ‌డం వ‌ల్ల  మనకు అనేక ర‌కాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

చాలా మంది త‌మ స్థోమ‌త‌, సౌక‌ర్యానికి అనుగుణంగా రోజూ వ్యాయామం చేస్తుంటారు.

అయితే ఎలాంటి ఖ‌ర్చు లేకుండా సుల‌భంగా చేసే వ్యాయామాల్లో ర‌న్నింగ్ ఒక‌టి.

రోజూ రన్నింగ్ చేయడం వలన కండరాలు దృఢంగా ఉంటాయి. అంతేకాక శరీరానికి శక్తి కూడా లభిస్తుంది.

అలానే రన్నింగ్ చేయడం వలన అధిక బ‌రువు త‌గ్గి.. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

రోజూ ర‌న్నింగ్ చేస్తే శ‌రీరంలో ఆక్సిజ‌న్ స్థాయిలు పెరుగుతాయి.

అయితే ర‌న్నింగ్ ఆరోగ్యకరమే అయిన‌ప్పటికీ.. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణలు చెబుతున్నారు.

ఆరంభంలో అయితే 15 నిమిషాల‌తో ర‌న్నింగ్ మొద‌లు పెట్టవ‌చ్చు. అందులో 5 నిమిషాలు వార్మప్ చేయాలి. 

అలా ఆ స‌మ‌యాన్ని 30 నిమిషాల‌కు పెంచాలి. అంటే.. 30 నిమిషాలు ర‌న్నింగ్ తో పాటు ఐదు నిమిషాల వార్మప్ చేయాలి.

ఇలా రోజూ 35 నిమిషాల పాటు ఈ విధంగా ర‌న్నింగ్ చేయ‌వ‌చ్చు.

ఇంకా చేస్తాం.. అనుకునే వారు ఇంకో 30 నిమిషాల పాటు అద‌నంగా ర‌న్నింగ్ చేయ‌వ‌చ్చు.

కానీ ఎక్కువ‌గా ర‌న్నింగ్ చేసినా దుష్ప్రభావాలు క‌లుగుతాయి.

క‌నుక ర‌న్నింగ్ ను ఒక పరిమిత సమయం పాటు మాత్రమే చేయాలి. 

రోజూ క‌నీసం 30 నిమిషాల పాటు ర‌న్నింగ్ చేస్తే చాల‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు.

అయితే బాగా శక్తి ఉందనుకునే వాళ్లు 60 నిమిషాల పాటు రన్నింగ్ చేయవచ్చు.

కానీ అలా చేసే సమయంలో ఇబ్బందులు ఎదుర‌వుతుంటే వెంట‌నే అలా చేయ‌డం మానేయాలి.

నోట్: పైన టిప్స్ పాటించేముందు మీ దగ్గర్లోని డాక్టర్, నిపుణుల సలహా కూడా తీసుకోవడం ఉత్తమం.