లవంగాలు ఎన్నో అనారోగ్య సమస్యలని తగ్గించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. అలానే శ్వాస, జీర్ణక్రియ వంటి ఎన్నో సమస్యలని తగ్గించడానికి కూడా ఉపయోగపడతాయి.

 వీటిని ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు. మరి అలాంటి లవంగాలు పరగడుపున తింటే ఏమవుతుందో తెలుసా?

పరగడుపున లవంగాలు తినడం వల్ల కొత్త కణాలు పెరుగుతాయి. కాలేయ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

లవంగాల్లో ఉండే థైమోల్, యూజెనాల్ లాంటి కెమికల్స్.. కాలేయం ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.

ఖాళీ కడుపుతో లవంగాలు తినడం వల్ల షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి.

ఇది తక్కువ ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుంది. ఇన్సులిన్ స్రావం, బీటా కణాల పనీతీరు మెరుగుపడుతుంది.

ఉదయం పరగడుపున లవంగాలు తింటే వికారం తగ్గుతుంది.

దీనిలో ఉండే యాంటీసెప్టిక్ లక్షణాలు.. వికారంతో బాధపడుతున్న వారికి స్వస్తత చేకూర్చుతాయి.

లవంగాలు.. నోటి వాపు, చిగుళ్ల వాపును కూడా తగ్గిస్తుంది. నోటి దుర్వాసనకు కూడా లవంగాలతో చెక్ పెట్టొచ్చు.

నోటిలో మిగిలిపోయిన ఆహార కణాలు, నోటిలో లాలాజలం నుంచి తయారైన జిగట పదార్థం పేరుకుపోకుండా లవంగాలు నిరోధిస్తాయి.

లవంగాల్లోని వేడి చేసే గుణం వల్ల జీర్ణక్రియ సమస్యలు పూర్తి తగ్గిపోతాయి.

ఇక లవంగాలను ఎక్కువగా ఉపయోగించినా ప్రమాదమే. దీని వల్ల నెమ్మదిగా రక్తం గడ్డకట్టడం, విరేచనాలు, వాంతులు, ఇతర అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి.

లవంగాల్లోని యాంటీ మెథాక్రోబయల్.. మన ప్రేగులోని చెడు బ్యాక్టీరియాను చంపడానికి ఉపయోగపడుతాయి.

లవంగాలు మోతాదులో తింటే.. ఆరోగ్యం, జీర్ణక్రియ, పోషకాల శోషణని ప్రోత్సాహిస్తుంది.