నేటికాలంలో ప్రతిఒక్కరి చేతిల్లో స్మార్ట్ ఫోన్లు దర్శనమిస్తున్నాయి.

కొందరు తెల్లవారింది మొదలు పడుకునే వరకు ప్రతిక్షణం ఫోన్ తో కాలక్షేపం చేస్తున్నారు.

రాత్రుళ్లు లేటుగా పడుకుని ఉదయం లేటుగా లేస్తున్నారు.

ఈ అలవాటు ఎన్నో ప్రమాదరకమైన రోగాలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

లేటుగా పడుకుని లేటుగా లేవడం వలన ఎలాంటి రోగాలొస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

రాత్రులు లేటుగా పడుకుని ఉదయం ఆలస్యంగా లేవడం వలన మెదడు పనితీరు మందగిస్తుంది. 

రాత్రులు ఆలస్యంగా పడుకోవడం వలన శరీరం హుషారుగా ఉండదు. 

ఈ అలవాట్ల వలన ఆకలిలో కూడా ఎన్నో మార్పులు వస్తాయి. 

ఆలస్యంగా పడుకోవడం, లేవడం చేస్తే జీర్ణక్రియ పనితీరు కూడా సక్రమంగా ఉండదు. 

ఈ అలవాటు వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరుగుతాయి. 

జీవగడియారంలో విపరీతమైన మార్పులు రావడం వల్ల ఒత్తిడి కూడా దారుణంగా పెరుగుతుంది.

ఉదయం లేటుగా లేవడం వలన చేస్తున్న పనిపట్ల ఏకాగ్రత కూడా ఉండదు.

నిద్రవేళలు సరిగ్గా ఉంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది. 

లేట్ గా లేవడం వల్ల మన శరీరం హుషారుగా ఉండదు. 

అలా కాకుండా త్వరగా పడుకుని త్వరగా లేవడం వలన ఆరోగ్యం చక్కగా ఉంటుంది.