నల్ల మిరియాలు మనదేశంలో చాలా విరివిగా పండుతాయి.

ఆహారంలో ఘాటు.. మంచి రుచి కోసం  వీటిని వాడుతారు.

మిర్యాలు వంటల్లోనే కాదు.. మంచి ఔషదంగా కూడా వాడుతుంటారు.

జలుబు లాంటి వ్యాధులతో బాధపడుతున్నప్పుడు మిరయాలను ఔషధంగా కూడా వాడుతారు.

మిరియాల్లో నల్లవే కాకుండా తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు, గులాబీ రంగుల్లో ఉంటాయి.

ఘాటైన వాసనను కలిగి ఉండడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కఫాన్ని కరిగిస్తాయి.

గ్లాసు నీటిలో మిర్యలను మరిగించి వడకట్టి తేనెతో రోజూ రెండు, మూడు సార్లు తీసుకుంటే.. జలుబు, దగ్గు మటుమాయం

లాలాజలం ఎక్కువగా ఊరేట్టు చేసి జీర్ణక్రియ సజావుగా జరిగేలా చూస్తాయి.

మిరియాల పొడి మిశ్రమాన్ని చిగుళ్లకు రాసుకొని కొద్ది సేపటి తర్వాత గోరువెచ్చని నీటితో పుక్కిలిస్తే వాపులు, రక్తం రావడం వంటివి తగ్గుతాయి.

పొట్టలోని వాయువులను బయటికి పంపి రక్తప్రసరణ వేగవంతమయేలా చేస్తుంది

మిర్యాల కషాయంతో మూత్ర విసర్జన సాఫీగా జరిగేలా చూస్తుంది. కండరాల నొప్పులు దూరమవుతాయి.

కొవ్వు ఎక్కువుగా పేరుకోకుండా చేసి. స్వేద ప్రక్రియ వేగవంతం చేస్తుంది .